iDreamPost
android-app
ios-app

స్మార్ట్‌ఫోన్‌లో ‘డిజిటల్‌ కండోమ్‌’.. దీని ఉపయోగం తెలిస్తే ఎగిరి గంతేస్తారు

  • Published Oct 30, 2024 | 10:53 AM Updated Updated Oct 30, 2024 | 10:53 AM

Digital Condom: స్మార్ట్ ఫోన్ లో డిజిటల్ కండోమ్ యాప్ తో మీ ప్రైవసీకి భద్రత ఉన్నట్టే. ఈ యాప్ బ్లూటూత్ టెక్నాలజీతో పనిచేస్తుంది. అనుమతి లేకుండా ఆడియోలు, వీడియోలు తీయడాన్ని నివారిస్తుంది.

Digital Condom: స్మార్ట్ ఫోన్ లో డిజిటల్ కండోమ్ యాప్ తో మీ ప్రైవసీకి భద్రత ఉన్నట్టే. ఈ యాప్ బ్లూటూత్ టెక్నాలజీతో పనిచేస్తుంది. అనుమతి లేకుండా ఆడియోలు, వీడియోలు తీయడాన్ని నివారిస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌లో ‘డిజిటల్‌ కండోమ్‌’.. దీని ఉపయోగం తెలిస్తే ఎగిరి గంతేస్తారు

ప్రపంచమంతా డిజిటల్ మయం అయిపోయింది. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ డివైజెస్ ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ హ్యూమన్ లైఫ్ స్టైల్ ను మార్చేసింది. మొబైల్ లేకుండా క్షణం కూడా గడపలేని పరిస్థితి. అవసరం ఏదైనా టక్కున గుర్తొచ్చేది స్మార్ట్ ఫోన్ మాత్రమే. ఆన్ లైన్ చెల్లింపులు, ఎంటర్ టైన్ మెంట్ ఇలా ఏదైనా స్మార్ట్ ఫోన్ నే యూజ్ చేస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ వాడకంతో వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లింది. మొబైల్ వాడకంతో ప్రైవసీ లేకుండా పోయింది. ఇందులో ప్రధానంగా స్మార్ట్ ఫోన్లతో ఫొటోలు, వీడియోలు తీయడం, ఆడియో రికార్డు చేయడం ఈజీ అయిపోయింది. ఆడియోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.

ముఖ్యంగా కొందరు శృంగార దృశ్యాలను ఫోటోలు, వీడియోలు తీసుకుంటారు. హోటళ్లు, లాడ్జీలకు వెళ్లే జంటల అశ్లీల దృశ్యాలను కేటుగాళ్లు సీక్రెట్ కెమెరాలతో రికార్డ్ చేస్తుంటారు. ఆ తర్వాత వాటిని అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడం, బెదిరింపులకు పాల్పడడం, డబ్బులు గుంజడం వంటి మోసాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి దారుణాలకు చెక్ పెట్టేందుకు జర్మనీకి చెందిన ప్రముఖ కండోమ్‌ బ్రాండ్‌ బిల్లీబాయ్‌.. డిజిటల్‌ కండోమ్‌ను తీసుకొచ్చింది. ఇన్నోసియన్‌ బెర్లిన్‌తో కలిసి ‘కామ్‌డోమ్‌’ పేరుతో కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. దీనినే డిజిట్ కండోమ్‌గా అభివర్ణిస్తున్నారు. కండోమ్ ఎలా అయితే సుఖ వ్యాధుల నుంచి రక్షిస్తుందో.. అదే మాదిరిగా కామ్ డోమ్ యాప్ వ్యక్తిగత ప్రైవసీకి భద్రత కల్పిస్తుంది.

మరి ఈ డిజిటల్ కండోమ్ ఎవరి కోసం? దీని ఉపయోగం ఏంటీ? ఇది ఎలా పనిచేస్తుంది? ఆవివరాలు ఇప్పుడు చూద్దాం. కామ్ డోమ్ యాప్ ప్రైవేట్ సమయాల్లో జంటల మధ్య ప్రైవసీని కాపాడుతుంది. శృంగార సమయంలో మన అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు, ఆడియోలను రికార్డు చేయకుండా నిరోధిస్తుంది. ఈ యాప్ ఫోన్లో ఉన్నట్లైతే ఎవరైనా సీక్రెట్‌గా వీడియోలు, ఆడియోలు రికార్డ్ చేసినా మన ఫోన్‌లో అలర్ట్ వస్తుంది. ఇది బ్లూటూత్‌ టెక్నాలజీతో పనిచేస్తుంది. స్మార్ట్ ఫోన్‌లోని బ్లూటూత్ ఆన్ చేయాలి. ఆ తర్వాత యాప్‌లోని వర్చువల్ బటన్‌ను క్రిందికి స్వైప్ చేయాలి. ఈ ప్రక్రియతో యాప్ ఆన్‌లోకి వస్తుంది. ఈ సమయంలో ఎవరైనా వీడియో, ఆడియో రికార్డ్ చేయాలని ప్రయత్నిస్తే వెంటనే మొబైల్‌లో అలారం మోగుతుంది.

అలాగే రికార్డు చేయడానికి ప్రయత్నించే వారి స్మార్ట్ ఫోన్‌, హిడెన్ కెమెరాలను బ్లాక్ చేస్తుంది. శృంగారానికి ముందు ఈ యాప్‌ని ఓపెన్ చేస్తే ఆ గదిలో సీక్రెట్ కెమెరాలు, మైక్రోఫోన్ల వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉంటే వాటిని గుర్తిస్తుంది. ఆ తర్వాత యూజర్లను అలారం ద్వారా హెచ్చరిస్తుంది. దీంతో మోసాల బారి నుంచి తప్పించుకోవచ్చు. ఈ కామ్ డోమ్ యాప్ ద్వారా అమ్మాయిలకు పూర్తి రక్షణ కలుగుతుంది. ఇంట్లో, ఆఫీసుల్లో, షాపింగ్ మాల్స్ లో, రెస్ట్ రూమ్స్ లో సీక్రెట్ కెమెరాల బెడద నుంచి తప్పించుకోవచ్చు. ప్రేమ జంటలకు, వివాహేతర సంబంధాల్లో ఉన్నవారు తమ ప్రైవసీ దెబ్బతినకుండా కామ్ డోమ్ యాజ్ ఉపయోగపడుతుంది. మరి డిజిటల్ కామ్ డోమ్ యాప్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.