ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రమాదం.. పట్టాలు తప్పిన 12 బోగీలు!

Dibrugarh Express.. ఉత్తర్‌ప్రదేశ్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. చండీగఢ్ నుండి దిబ్రూగఢ్ కు వెళుతున్న దిబ్రూగడ్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.

Dibrugarh Express.. ఉత్తర్‌ప్రదేశ్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. చండీగఢ్ నుండి దిబ్రూగఢ్ కు వెళుతున్న దిబ్రూగడ్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.

ఇటీవల వరుస రైలు ప్రమాదాలు ప్రయాణీకుల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. గత ఏడాది ఒడిశాలోని బాలాసోర్ వద్ద కోరమాండల్ ఎక్స్ ప్రెస్ దుర్ఘటన ఎంతటి విషాదాన్ని నింపిందో అందరికీ తెలుసు. ఈ ఘటనలో సుమారు 300 మంది మరణించగా.. మరో వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. చండీగఢ్ నుండి దిబ్రూగఢ్‌కు వెళుతున్న దిబ్రూగడ్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. కాగా, 12 బోగీలు పక్కకు ఒరిగాయి.  యుపీలోని గోండా-మాంకాపూర్ సెక్షన్‌లో ఈ ప్రమాదం సంభవించింది. ఇద్దరు మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పెద్ద సంఖ్యలు ప్రయాణీకులు గాయపడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

15904 నంబర్ గల దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ చండీగఢ్ నుండి దిబ్రూగఢ్ వరకు నడుస్తుంది. ఈ రైలు బుధవారం రాత్రి 11:39 గంటలకు చండీగఢ్‌లో బయలుదేరింది. గురువారం మధ్యాహ్నం గోండా-బస్తీ మధ్య ఉన్న జిలాహి స్టేషన్‌కు చేరుకోగా.. ఒక్కసారిగా పెద్ద శబ్దం నెలకొంది. అంతలో రైలు పట్టాలు తప్పడం స్టార్ట్ అయ్యింది. దీంతో ప్రయాణీకుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. అలా మొత్తం 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనపై రైల్వే శాఖకు సమాచారం అందింది. కాగా, ఏసీ బోగీలు పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తుంది. సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. గోండాలోని జిలాహి జంక్షన్ సమీపంలో రైలు ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టి సారించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని పేర్కొన్నారు. ప్రయాణీకులకు తక్షణ సౌకర్యాలు కల్పించాలని చెప్పారు

Show comments