101 KG Gold For Ayodhya Ram Mandir: బాలరాముడికి 101 కిలోల బంగారం విరాళంగా ఇచ్చిన వ్యాపారి

Ayodhya Ram Mandir: బాలరాముడికి 101 కిలోల బంగారం విరాళంగా ఇచ్చిన వ్యాపారి

అయోద్య బాల రాముడికి దేశ, విదేశాల నుంచి రూ.వేల కోట్లు విరాళాలుగా వచ్చాయి. వాటిలో ఒక వ్యాపారి 101 కిలోల బంగారం విరాళమిచ్చారు.

అయోద్య బాల రాముడికి దేశ, విదేశాల నుంచి రూ.వేల కోట్లు విరాళాలుగా వచ్చాయి. వాటిలో ఒక వ్యాపారి 101 కిలోల బంగారం విరాళమిచ్చారు.

దశాబ్దాలుగా యావత్ దేశం ఎదురుచూసిన ఆ క్షణం రానే వచ్చింది. అంగరంగ వైభవంగా ఆ శ్రీరాముడు అయోధ్యలో బాలరాముని రూపంలో కొలువుదీరాడు. ఈ మహా ఘట్టాన్ని ఒక్క భారతీయులు మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా తిలకించింది. జైశ్రీరామ్ నినాదాలతో ఆ అయోధ్య మారుమోగింది. ప్రతి రామ భక్తుడి హృదయం పులకించి పోయింది. ఆ రాములోరికి ఎవరి స్థోమతకు తగినట్లు వాళ్లు బహుమతులు, విరాళాలు సమర్పించుకున్నారు. అయితే ఇప్పటివరకు వచ్చిన విరాళాల్లో అతి పెద్ద విరాళం ఏది? ఎవరు ఇచ్చారు అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. మరి.. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇప్పటివరకు అయోధ్య రామయ్యలు బహుమతులు, విరాళాలు చాలానే వచ్చాయి. వేల కోట్ల రూపాయలను కానుకల రూపంలో అందించారు. భారతీయులు మాత్రమే కాకుండా విదేశీయులు కూడా విరాళాలు, బహుమతులు అందజేశారు. వాటిలో ఒక వ్యాపారి మాత్రం అందరి కంటే అధికంగా ఏకంగా 101 కిలోల బంగారాన్ని ఆ రామయ్యకు బహుమతిగా అందజేశారు. అందరి భక్తులలో పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చింది ఈ వ్యాపారే. అతని పేరు వీ దిలీప్ కుమార్. ఇతను సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి. ఆ రామయ్యకు వచ్చిన విరాళాలలో దిలీప్ కుమార్ ఇచ్చిందే అతి పెద్ద విరాళం.

ఆ అయోధ్య రామ మందిరంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం 15 బంగారు ద్వారాలను ఏర్పాటు చేశారు. దిలీప్ కుమార్ ఇచ్చిన బంగారాన్ని ద్వారాలు, గర్భగుడి, త్రిశూలం, ఢమరుకం వంటి వస్తువుల కోసం వినియోగించారు. అయోధ్యకు రూ.3 వేల కోట్లకు పైగా విరాళాలు వచ్చినట్లు ఇప్పటికే రామజన్మభూమి తీర్థ ట్రస్టు సభ్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. నగదు రూపంలో వచ్చిన విరాళాల్లో ఆధ్యాత్మిక నేత మొరారీ బాపు శిష్యులు రూ.16 కోట్లు అందజేశారు. మొరారీ బాపు రూ.11.3 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత సూరత్ కు చెందిన మరో వజ్రాల వ్యాపారి గోవింద్ భాయ్ ఢోలాభాయ్ రూ.11 కోట్లు విరాళంగా ఇచ్చారు. గుజరాత్ కు చెందిన ఓ బాలిక ఏకంగా రూ.52 లక్షలు విరాళంగా అందజేసింది. దాదాపు మూడేళ్లపాటు 50 కిలోమీటర్లు ప్రయాణించి రూ.52 లక్షలను విరాళాలను సేకరించింది. వాటిని ఆ బాలరాముడికి అందజేసింది.

ఇలా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, భక్తులు, సెలబ్రిటీలు అందరూ తమ వంతుగా ఆ అయోధ్య రామయ్యకు విరాళాలు అందజేశారు. ఆ బాల రాముడు అంగరంగ వైభవంగా అయోధ్యలో కొలువుదీరాడు. రామయ్య ప్రాణ ప్రతిష్టతో అయోధ్య రూపురేఖలు మారిపోతాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రామయ్య సన్నిధి వల్ల ఉత్తరప్రదేశ్ వేల కోట్లు ఆర్జిస్తుందని అంచనాలు వేస్తున్నారు. ఇది గొప్ప పుణ్యక్షేత్రంగా మారబోతోందని చెబుతున్నారు. జనవరి 23 నుంచి సామాన్య భక్తులకు సైతం అయోధ్య రామయ్యను దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ బాల రాముని దర్శనం కోసం మీరు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ సమయంలో మీ ఫొటో, వివరాలను అందజేయాల్సి ఉంటుంది. అలాగే మీతోపాటు ఎంతమంది వస్తున్నారు అనే వివరాలను కూడా అందివ్వాలి. మరి అయోధ్య బాల రాముడి కోసం 101 కిలోల బంగారాన్ని విరాళంగా ఇవ్వడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Show comments