టన్నెల్‌లోని కార్మికుల కోసం 21 వేల దీపాలతో ప్రత్యేక ప్రార్థనలు

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సొరంగం కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కార్మికులను బయటకు తెచ్చేందుకు ఉన్నత మార్గమైన వర్టికల్ డ్రిల్లింగ్‌ను ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించారు. అయితే ప్రతికూల వాతావరణం సహాయక బృందానికి పెను సవాలుగా మారింది.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సొరంగం కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కార్మికులను బయటకు తెచ్చేందుకు ఉన్నత మార్గమైన వర్టికల్ డ్రిల్లింగ్‌ను ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించారు. అయితే ప్రతికూల వాతావరణం సహాయక బృందానికి పెను సవాలుగా మారింది.

ఉత్తరాఖండ్ ఉత్తర కాశీ జిల్లా సిల్క్యరా వద్ద నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో 41 మంది కార్మికులు చిక్కుకున్న సంగతి విదితమే. నవంబర్ 12న ఈ ఘటన జరగ్గా.. వారిని వెలికి తీసేందుకు  సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. వర్ష సూచన, 4 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రెస్య్కూ ఆపరేషన్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. అయితే వారిని బయటకు తీసేందుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో కార్మికుల ఆరోగ్యం, ఇతర అంశాలపై ఆందోళన వ్యక్తం అవుతుంది. వారు తిరిగి క్షేమంగా రావాలని కుటుంబ సభ్యులు బలంగా కోరుకుంటున్నారు.

కుటుంబ సభ్యులే కాదూ.. వారు సురక్షితంగా బయటపడాలని దేశ వ్యాప్తంగా ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. ఆ శిథిలాల నుండి 41 మంది కార్మికులు క్షేమంగా బయట పడాలని హరిద్వార్ లోని భక్తులు హర్ కీ పౌరి వద్ద 21 వేల దీపాలను వెలిగించి, ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. హర్ కీ పౌరి అంటే విష్ణు పాదాలని అర్థం. గంగానది ఒడ్డున ఉన్న ఘాట్. ఇక్కడే గంగా నది పర్వతాలను వీడి మైదానాల్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు భక్తులు. ఇక్కడే 21 వేల దీపాలు వెలిగించిన భక్తులు.. వారి క్షేమంగా తిరిగి రావాలని ఆ దేవుడ్ని వేడుకుంటున్నారు. సోమవారానికి ఈ సొరంగం వద్ద రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి 16వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో వారంతా ప్రాణాలతో బయటపడాలని దేశ వ్యాప్తంగా ప్రజలు వారి మతాచారాల ప్రకారం ప్రేయర్స్ చేస్తున్నారు.

నవంబర్ 12న కూలిన నాటి నుండి శిథిలాల కింద 41 మంది కార్మికులు చిక్కుకుని 360 గంటలు గడిచాయి. వారి రాక కోసం యావత్ భారతావని నిరీక్షిస్తున్నారు. సొరంగం తవ్వడానికి తెచ్చిన ఆగర్ మిషన్ ఆగిపోయింది. దీంతో  ఆదివారం వారిని బయటకు తెచ్చేందుకు ఉన్నత మార్గమైన వర్టికల్ డ్రిల్లింగ్ ప్రక్రియను చేపట్టారు. అయితే ప్రకృతి సహాయక చర్యలపై పగబట్టింది. వాతావరణం సహకరించకపోయినా.. వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రెస్య్యూ అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు చేపట్టిన వర్టికల్ డ్రిల్లింగ్ ప్రక్రియ గురువారం నాటికి విజయవంతంగా పూర్తవుతుందని, దీంతో ఊహించని అడ్డంకులు తలెత్తవని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. 41 రాక కోసం దేశమంతా కులమతాలకు అతీతంగా ప్రార్థనలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments