దేశప్రజలు మాత్రమే కాకుండా.. ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్-3 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. చంద్రుడిపై ఇప్పటి వరకు చూడని దక్షిణ ధ్రువంపై దాగిఉన్న రహస్యాలను ఛేదించేందుకు ఇస్రో ఈ ప్రయోగాన్ని చేస్తోంది. జులై 14 శుక్రవారం శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగం జరగనుంది. గురువారం మధ్యాహ్నం 1.05 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. బాహుబలి రాకెట్ గా గుర్తింపు సాధించిన ఎల్వీఎం3-ఎం4 వాహక నౌక దీనిని మోసుకెళ్లనుంది. 25.30 గంటల తర్వాత కౌంట్ డౌన్ ముగిసి.. రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
చంద్రయాన్-3 ప్రయోగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2019లో జరిగిన చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైన విషయం తెలిసిందే. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో విఫలమైంది. గత అనుభవాల దృష్ట్యా ఇస్రో అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ప్రయోగం సక్సెస్ కావాలంటూ.. ఇస్రో శాస్త్రవేత్తల బృందం చెంగాళమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు.
ఈ ప్రయోగం సక్సెస్ అయితే చంద్రుడిపైకి వాహన నౌకలు పంపిన లిస్టులో భారత్ కూడా చేరుతుంది. ఇప్పటికే అమెరికా, చైనా, రష్యా దేశాలు ఈ ప్రయోగాలను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. అది మాత్రమే కాకుండా.. ఈ చంద్రయాన్-3 ప్రయోగానికి, అందుకు వినియోగిస్తున్న బాహుబలి రాకెట్ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇస్రో డెవలప్ చేసిన లాంఛ్ వెహికిల్స్ లో ఎల్వీఎం-3 ఎంతో పవర్ ఫుల్. ఎంతో బరువును సునాయాసంగా తీసుకెళ్లగలదు. ఇందులో ప్రయోగంలో రెండు ఘన ఇంధన, ఒక ధ్రవ ఇంధన బూస్టర్లను వాడతారు. ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడానికి రెండు ఘన ఇంధన బూస్టర్లను వాడతారు. ఆ తర్వాత రాకెట్ చంద్రుడి కక్షలోకి ప్రవేశించేందుకు ధ్రవ ఇంధన బూస్టర్ దోహదపడుతుంది.
🚀LVM3-M4/Chandrayaan-3🛰️ Mission:
Today, at Satish Dhawan Space Centre, Sriharikota, the encapsulated assembly containing Chandrayaan-3 is mated with LVM3. pic.twitter.com/4sUxxps5Ah
— ISRO (@isro) July 5, 2023
ఈ ప్రయోగంలో దశలవారీగా ఘన, ధ్రవ ఇంధన బూస్టర్లు, స్ట్రాప్- ఆన్ బూస్టర్లను నిర్దేశిత సమయాల్లో వినియోగిస్తారు. పేలోడ్ ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టేందుకు అవసరమైన శక్తికోసం భారత్ లో తయారు చేసిన క్రయోజెనిక్ ఇంజిన్ సీఈ-20ని వినియోగిస్తున్నారు. ఈ బాహుబలి రాకెట్ విశేషాలు కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ రాకెట్ బరువు 640 టన్నుల, పొడవు 43.5 మీటర్లు, 4,000 కిలోల వరకు పేలోడ్ ను జీటీవో వరకు మోసుకెళ్లగలదు. ఇప్పటి వరకు ఈ రాకెట్ ద్వారా 3 ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ రాకెట్ ను మొదట జీఎస్ఎల్వీ- ఎంకే3గా పిలిచేవారు. తర్వాత దీనికి ఇస్రో ఎల్వీఎం-3గా నామకరణం చేసింది. ఈ రాకెట్ ద్వారా చేస్తున్న నాలుగో ప్రయోగం చంద్రయాన్-3. ఈ ప్రయోగం కోసం రూ.615 కోట్లు ఖర్చు చేశారు.
Chandrayaan-3 mission:
The ‘Launch Rehearsal’ simulating the entire launch preparation and process lasting 24 hours has been concluded.Mission brochure: https://t.co/cCnH05sPcW pic.twitter.com/oqV1TYux8V
— ISRO (@isro) July 11, 2023
ఈ ప్రయోగం తర్వాత ఇస్తోర సూర్యూడిపై గురిపెట్టింది. అందుకోసం పీఎస్ఎల్వీ- సీ 56 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఇప్పటికే ఈ ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సౌర తుపాను సమయంలో వెలువడే సౌర వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం చేయనున్నారు. ఆగస్టు నెల చివర్లో ఈ ప్రయోగం చేయాలని ఇస్తో చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రూ.378 కోట్లు ఖర్చు చేయనున్నారు.
LVM3 M4/Chandrayaan-3 Mission:
Mission Readiness Review is completed.
The board has authorised the launch.
The countdown begins tomorrow.The launch can be viewed LIVE onhttps://t.co/5wOj8aimkHhttps://t.co/zugXQAY0c0https://t.co/u5b07tA9e5
DD National
from 14:00 Hrs. IST…— ISRO (@isro) July 12, 2023