iDreamPost
android-app
ios-app

PUC సర్టిఫికెట్ లేకుండా పెట్రోల్ బంక్ కు వెళ్తే రూ.10 వేలు ఫైన్

  • Published Aug 11, 2024 | 3:25 PM Updated Updated Aug 11, 2024 | 3:44 PM

Delhi-PUC Certificate: వాహనదారులకు కీలక అలర్ట్ జారీ చేశారు. ఇకపై ఆ సర్టిఫికెట్ లాకుండా పెట్రోల్ బంకుల్లోకి వెళ్తే.. 10 వేల రూపాయల ఫైన్ విధించనున్నారు. ఆ వివరాలు..

Delhi-PUC Certificate: వాహనదారులకు కీలక అలర్ట్ జారీ చేశారు. ఇకపై ఆ సర్టిఫికెట్ లాకుండా పెట్రోల్ బంకుల్లోకి వెళ్తే.. 10 వేల రూపాయల ఫైన్ విధించనున్నారు. ఆ వివరాలు..

  • Published Aug 11, 2024 | 3:25 PMUpdated Aug 11, 2024 | 3:44 PM
PUC సర్టిఫికెట్ లేకుండా పెట్రోల్ బంక్ కు వెళ్తే రూ.10 వేలు ఫైన్

కొన్ని రోజుల క్రితమే వాహనదారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నియమాలు అమల్లోకి తెచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్ జారీ, వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవింగ్ రూల్స్ వంటి వాటికి సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది. నిబంధనలు అతిక్రమిస్తే.. భారీ ఎత్తున జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. ఇకపై వాహనదారులు ఆ సర్టిఫికెట్ లేకుండా పెట్రోలు బంకుల్లోకి వెళ్తే.. 10 వేల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఆ వివరాలు..

ఢిల్లీ ప్రభుత్వం వాహనదారులకు కీలక అలర్ట్ జారీ చేసింది.  కాలుష్యాన్ని అరికట్టేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయించుకోవాలంటే పొల్యూషన్ సర్టిఫికేట్ తప్పనిసరి అని తెలిపింది. వాహనాల్లో పెట్రోల్, డీజిల్ నింపడానికి కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ – పీయూసీని తనిఖీ చేయడం తప్పనిసరి అని పేర్కొంది.

Traffic

 

ఒక వేళ పీయూసీ సర్టిఫికేట్ లేకుండా వాహనం పెట్రోల్ బంకుకు వెళ్తే రూ. 10,000 జరిమానా విధించనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం.. ఆ రాష్ట్రంలోని 100 పెట్రోల్‌ పంపుల్లో పీయూసీ చెకింగ్‌ కోసం కెమెరాలు, సాఫ్ట్‌వేర్‌ను అమర్చాలని నిర్ణయించింది.

ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వం ఓ ప్రైవేట్‌ కంపెనీకి టెండర్‌లను ఇచ్చింది. నవగతి టెక్ కంపెనీ అనే సంస్థ దీన్ని దక్కించుకుంది. ఆగస్టు 15 లోగా సదరు కంపెనీ తన సేవలను ప్రారంభించాల్సి ఉంటుందని ఢిల్లీ సర్కార్ తెలిపింది. సాధారణంగా ట్రాఫిక్ పోలీసులే ఈ పొల్యుషన్ సర్టిఫికేట్లను చెక్ చేస్తారు. అయితే కొందరు వాహనాదారులు ట్రాఫిక్ పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటున్నారు. అలాంటి వారిని పట్టుకోవడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాహనదారులు కచ్చితంగా పెట్రోల్ బంకుకు రావాల్సిందే. అప్పుడు పొల్యుషన్ సర్టిఫికేట్ లేకుంటే ఫైన్లు వేయవచ్చని ఢిల్లీ రవాణా శాఖ అధికారులు ఈ సరికొత్త ప్రయోగాన్ని చేపట్టనున్నారు.

Traffic

ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయి.. కొన్ని సందర్భాల్లో పాఠశాలలు, కాలేజీలు, ఆఫీసులకు సెలవులు ప్రకటించడం.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసుకోమనడం.. సరి-బేసి వాహనాలను నడపడం సహా భవననిర్మాణ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయడం లాంటి కఠిన ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అలాంటి పరిస్థితి రాకుండా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.