iDreamPost
android-app
ios-app

Delhi Uber Driver Pakistani: దేశంపై పాకిస్తానీ మహిళ కామెంట్స్.. కారులోంచి దించేసిన ఉబర్ డ్రైవర్

  • Published Aug 13, 2024 | 9:46 PM Updated Updated Aug 13, 2024 | 9:46 PM

This Cab Driver Became National Hero: క్యాబ్స్ లో అనేక రకాల మనుషులు ప్రయాణిస్తుంటారు. విదేశీయులు కూడా ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో ఓ పాకిస్తానీ మహిళ కూడా క్యాబ్ లో ప్రయాణం చేసింది. అయితే దేశంపై ఆ పాకిస్తానీ మహిళ తప్పుగా మాట్లాడిందని క్యాబ్ లోంచి దించేశాడు.

This Cab Driver Became National Hero: క్యాబ్స్ లో అనేక రకాల మనుషులు ప్రయాణిస్తుంటారు. విదేశీయులు కూడా ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో ఓ పాకిస్తానీ మహిళ కూడా క్యాబ్ లో ప్రయాణం చేసింది. అయితే దేశంపై ఆ పాకిస్తానీ మహిళ తప్పుగా మాట్లాడిందని క్యాబ్ లోంచి దించేశాడు.

Delhi Uber Driver Pakistani: దేశంపై పాకిస్తానీ మహిళ కామెంట్స్.. కారులోంచి దించేసిన ఉబర్ డ్రైవర్

ఇటీవల కాలంలో క్యాబ్ సేవలను వినియోగించుకునేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. సమయంతో సంబంధం లేకుండా ఏ టైంలో అయినా సరే క్యాబ్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. అర్ధరాత్రుళ్లు కూడా క్యాబ్స్ బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అయితే ఒక రాత్రి జరిగిన ఇన్సిడెంట్ కారణంగా ఓ క్యాబ్ డ్రైవర్ నేషనల్ హీరో అయిపోయాడు. అతను చేసిన పనికి సోషల్ మీడియాలో నెటిజన్స్ సెల్యూట్ చేస్తున్నారు. ధైర్యవంతుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ క్యాబ్ డ్రైవర్ చేసిన పని ఏంటి? అతన్ని నేషనల్ హీరో అని ఎందుకు అంటున్నారు? ఆ కథేంటో పూర్తి వివరాలు మీ కోసం.  

 సోషల్  మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో పాకిస్తానీ మహిళ, ఇండియాకి చెందిన ఆమె స్నేహితురాలు క్యాబ్ లో ప్రయాణం చేస్తున్నారు. అప్పుడు సమయం అర్ధరాత్రి 12.30 అవుతుంది. అయితే క్యాబ్ డ్రైవర్ ఇద్దరినీ క్యాబ్ లోంచి దించేసి మిమ్మల్ని మీ లొకేషన్ లో డ్రాప్ చేయను అంటూ వెల్లడించాడు. దీంతో పాకిస్తానీ మహిళ, భారతీయ మహిళ ఇద్దరూ డ్రైవర్ తో గొడవకు దిగారు. ఢిల్లీలోని అర్ధరాత్రి సమయంలో పాకిస్తానీ మహిళను, ఇండియన్ మహిళను ఇద్దరినీ కారులోంచి దింపేశాడు. వీడియోలో ఉబర్ డ్రైవర్.. వాళ్ళని అవును మీరు పాకిస్తానీ.. మీ ఇద్దరూ  పాకిస్తానీ అంటూ మాట్లాడుతున్నాడు. ఉబర్ డ్రైవర్ మమ్మల్ని అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో రోడ్డు మీద వదిలేశాడని ప్రయాణికురాలు వెల్లడించింది. అయితే ఉబర్ డ్రైవర్ అలా ప్రవర్తించడానికి కారణం.. భారతీయుల మీద అనుచిత కామెంట్స్ చేయడమే అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. భారత్ గురించి, ఢిల్లీ ప్రజల గురించి అవమానకరంగా మాట్లాడారని ఆరోపిస్తున్నారు.

భారతీయులు స్వార్ధపరులు అంటూ పాకిస్తానీ మహిళ.. భారతీయ మహిళతో అంటుంటే.. అది విన్న ఉబర్ డ్రైవర్ అలాంటి మాటలు మాట్లాడద్దు అని అన్నట్లు చెబుతున్నారు. అయితే పాకిస్తానీ మహిళ.. ఇది మోడీ ఇండియా అంటూ అరవడం మొదలుపెట్టింది. దీంతో డ్రైవర్ వాళ్ళని క్యాబ్ లోంచి దింపేసి రోడ్డు మీద వదిలేశాడు. ఇది ఉబర్ డ్రైవర్ వైపు వెర్షన్. క్యాబ్ లో  ప్రయాణించిన ప్రయాణికుల వెర్షన్ మరొకలా ఉంది. పాకిస్తానీ ఫ్రెండ్, తాను క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నామని.. ఢిల్లీ ప్రజలు, పాకిస్తాన్ లో ఉంటున్న తన బంధువులు స్వార్ధపరులు అని తన ఫ్రెండ్ తనతో అన్నదని పాకిస్తానీ ఫ్రెండ్ అయిన భారత మహిళ వెల్లడించింది. తమ మాటలను విన్న ఉబర్ డ్రైవర్ తమను క్యాబ్ లోంచి దింపేశాడని ఆమె చెబుతుంది. అయితే ఇద్దరిలో ఎవరి వెర్షన్ నిజం అనేది పక్కన పెడితే.. ఉబర్ డ్రైవర్ కి మెజారిటీ శాతం మంది నెటిజన్స్ సపోర్ట్ గా నిలుస్తున్నారు. నేషనల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఉబర్ డ్రైవర్ తీరుని తప్పుబడుతున్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.