iDreamPost
android-app
ios-app

లంచం డబ్బులని వాటాలు వేసుకుంటూ దొరికిపోయిన ట్రాఫిక్ పోలీసులు

  • Published Aug 18, 2024 | 4:05 PM Updated Updated Aug 18, 2024 | 4:05 PM

Traffic Police Sharing Bribe Money: విక్రమార్కుడు సినిమాలో ఒక సీన్ ఉంటుంది. దొంగలు తాము దొంగిలించిన సొమ్ముని వాటాలు వేసుకుంటూ ఉంటారు. సరిగ్గా అలాంటి సన్నివేశమే ఒకటి రియల్ లైఫ్ లో జరిగింది.

Traffic Police Sharing Bribe Money: విక్రమార్కుడు సినిమాలో ఒక సీన్ ఉంటుంది. దొంగలు తాము దొంగిలించిన సొమ్ముని వాటాలు వేసుకుంటూ ఉంటారు. సరిగ్గా అలాంటి సన్నివేశమే ఒకటి రియల్ లైఫ్ లో జరిగింది.

లంచం డబ్బులని వాటాలు వేసుకుంటూ దొరికిపోయిన ట్రాఫిక్ పోలీసులు

విక్రమార్కుడు సినిమాలో రవితేజ, బ్రహ్మానందం పాత్రలు దొంగిలించిన సొమ్ముని వాటా వేసుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయానికి ఒక లేడీ పోలీస్ వస్తుంది. అది సినిమా కాబట్టి అక్కడ ఏం జరగలేదు. కానీ రియల్ లైఫ్ లో ఇలాంటివి చేసి దొరికితే మామూలుగా ఉండదు. అందులోనూ పోలీసులు చేస్తే పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి. తాజాగా ట్రాఫిక్ పోలీసులు విక్రమార్కుడు సీన్ ని రిపీట్ చేశారు. డబ్బుని వాటాలు వేసుకుని మరీ పంచుకుంటున్న విజువల్స్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో వీడియో కాస్తా వైరల్ గా మారింది. పోలీసులే దొంగలైతే అన్న చందాన ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు ప్రజల నుంచి దోచుకున్న లంచం సొమ్మును ఒక చోట కూర్చుని పంచుకుంటున్నారు. 

వివరాల్లోకి వెళ్తే.. ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు ఢిల్లీలోని ఘాజీపూర్ థ్రిల్ లౌరీ సర్కిల్ చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమించిన వాహనదారుల నుంచి లంచం తీసుకోవడం మొదలుపెట్టారు. డ్యూటీ అయ్యాక కలెక్షన్స్ ఎంత వచ్చాయి? ఎవరెవరి వాటా ఎంతెంత? అని లెక్కలేసుకుని మరీ పంచుకున్నారు. అయితే ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోలో ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఒక పోలీసు తన వెనుక ఉన్న టేబుల్ పై నోట్ల కట్టను ఉంచిన వ్యక్తికి సైగలు చేశాడు. ఆ వ్యక్తి వెళ్లిన తర్వాత ఒక పోలీస్ కూర్చుని డబ్బులు లెక్కపెట్టాడు. ఆ మొత్తాన్ని ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు వాటాలు వేసుకున్నారు.

లంచంగా వచ్చిన డబ్బులని వాటాలు వేసుకుంటున్న విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో పై అధికారుల దృష్టికి వెళ్లడంతో ముగ్గురు ట్రాఫిక్ పోలీసులను సస్పెండ్ చేశారు. ముగ్గురు పోలీసులపై శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్లు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వెల్లడించారు. లంచం డబ్బు పంచుకుంటూ కెమెరాకి చిక్కిన ఇద్దరు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లని, ఒక కానిస్టేబుల్ ని సస్పెండ్ చేశామని అన్నారు. ప్రాథమిక విచారణ అనంతరం చర్యలు తీసుకున్నామని అన్నారు. అయితే ఈ సస్పెండ్ వ్యవహారంపై నెటిజన్స్ తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. ఢిల్లీలో ఇలాంటివి మామూలే అని ఒకరు, సస్పెన్షన్ అనేది వారికి హాలిడే ట్రిప్ లాంటిదని ఒకరు ఇలా పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి విక్రమార్కుడు సినిమాలోని సీన్ లో మాదిరి లంచం సొమ్ముని వాటాలేసుకుంటూ పోలీసులు దొరికిపోవడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.