Nidhan
Vistara Flight Emergency Landing: విమానాలు అప్పుడప్పుడు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతుంటాయి. ఇలా ల్యాండ్ అయిన సమయాల్లో ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా మన దేశంలో ఓ ఫ్లైట్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
Vistara Flight Emergency Landing: విమానాలు అప్పుడప్పుడు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతుంటాయి. ఇలా ల్యాండ్ అయిన సమయాల్లో ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా మన దేశంలో ఓ ఫ్లైట్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
Nidhan
విమానాలు అప్పుడప్పుడు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతుంటాయి. ఇలా ల్యాండ్ అయిన సమయాల్లో ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. వాతావరణం ప్రతికూలంగా మారడం, ఫ్లయిట్లో సాంకేతిక లోపాలు తలెత్తడం, ప్రయాణికుల్లో ఎవరికైనా హెల్త్ ఎమర్జెన్సీ ఏర్పడిన సమయాల్లో విమానాలను అత్యవసరంగా కిందకు దించుతుంటారు. అయితే ఇలా ల్యాండ్ అయ్యే క్రమంలో ఒక్కోసారి పట్టు తప్పి ప్రమాదాలు జరగడం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా మన దేశంలో ఓ ఫ్లైట్‌ను ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. గాల్లో ఎగురుతున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వాళ్లు భయాందోళనకు లోనయ్యారు.
ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న విస్తారా ఫ్లైట్‌ను అత్యవసరంగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దించారు. విమానం గాల్లో ఉండగానే హైడ్రాలిక్ వ్యవస్థలో సమస్య తలెత్తడంతో అప్రమత్తం అయ్యారు పైలట్లు. చివరి నిమిషంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారని సమాచారం. దీంతో ప్యాసింజర్స్ ఊపిరి పీల్చుకున్నారట. ఆ టైమ్‌లో ఫ్లైట్‌లో 167 మంది ప్రయాణిస్తున్నారని తెలిసింది. ఈ ఘటనపై విస్తారా సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. విమానంలో చిన్న సమస్య తలెత్తడంతో ల్యాండింగ్ చేశామని పేర్కొంది. ముందు జాగ్రత్తగా పైలట్లు రిక్వెస్ట్ చేయడంతో ల్యాండింగ్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఓకే చెప్పిందని.. దీంతో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని సేఫ్‌గా దింపామని వివరించింది.