iDreamPost
android-app
ios-app

వీడియో: మెట్రో ట్రైన్ రూఫ్‌పై మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు!

  • Published May 28, 2024 | 3:19 PM Updated Updated May 28, 2024 | 3:19 PM

Metro Train: రైలు ప్రయాణాలు ఎంతో సురక్షితం.. సౌకర్యం అని అంటారు. అందుకే సుదూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువగా రైలు ప్రయాణం చేస్తుంటారు. మెట్రో అందుబాటులోకి వచ్చిన తర్వాత లోకల్ గా ప్రయాణాలు ఈజీ అయ్యాయి.

Metro Train: రైలు ప్రయాణాలు ఎంతో సురక్షితం.. సౌకర్యం అని అంటారు. అందుకే సుదూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువగా రైలు ప్రయాణం చేస్తుంటారు. మెట్రో అందుబాటులోకి వచ్చిన తర్వాత లోకల్ గా ప్రయాణాలు ఈజీ అయ్యాయి.

వీడియో: మెట్రో ట్రైన్ రూఫ్‌పై మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు!

దేశంలో ఈ మధ్య తరుచూ రైలు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. సుదూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువగా రైలు ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. బస్సు ప్రయాణం లో లేని సౌకర్యాలు ట్రైన్ లో ఉంటాయి. అందుకే సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ట్రైన్ ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంటారు.దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ లక్షల సంఖ్యలో రైలు ప్రయాణాలు చేస్తున్నారు. ఇటీవల అన్ని హంగులతో మెట్రో ట్రైన్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల మెట్రోలో ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా మెట్రో ట్రైన్ రూఫ్ పై మంటలు రావడంతో ప్రయాణికులు పరుగులు పెట్టారు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మెట్రో అందుబాటులోకి వచ్చిన ప్రశాంతమైన ప్రయాణంతో పాటు త్వరగా గమ్యస్థానం చేరుకుంటున్నారు.ఢిల్లీ మెట్రో ట్రైన్ ఎప్పుడూ వార్తల్లో ట్రెండ్ అవుతుంది. మెట్రో ట్రైన్ లో ప్రయాణికులు చేసే హడావుడి.. హల్ చల్, రొమాన్స్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ మెట్రో ట్రైన్ కి సంబంధించిన వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. వైషాలి ప్రాంతానికి వెళ్లే మెట్రో ట్రైన్ లో సోమవారం సాయంత్రం రాజీవ్ చౌక్ స్టేషన్ వద్ద ఆగింది. దాని రూఫ్ పై స్వల్పంగా మంటలు కనిపించడంతో ఫ్లాట్ ఫామ్ పై ఉన్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారున కొంతమంది ఈ ఘటన వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. తాజాగా ఈ ఘటనపై ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్ స్పందించింది.

ఈ ఘటన పెద్ద ప్రమాదం కాదని.. రైలు రూఫ్ పై వేలాడే విద్యుత్ తీగలు.. దాని నుంచి వచ్చిన విద్యుత్ ప్రవాహాన్ని గ్రహించేందుకు ఉండే ఇనుక కడ్డీల పరికరం మద్య ఏవైనా చిక్కుకున్నా.. ఇరుక్కుపోయినా రాష్ ఏర్పడి స్వల్ప మంట వస్తుందని ఓ ప్రకటనలో తెలిపారు. దీనివల్ల భద్రతకు ఎలాంటి ముప్పు లేదని.. భయపడాల్సిన పని లేదని తెలిపారు. అయితే ఇలా ఎందుకు జరిగిందన్న విషయంపై దర్యాప్తు జరుపుతామని తెలిపింది. సాధారణంగా ఎండా కాలంలో రైలు ప్రమాదాల ఎక్కువగా జరుగుతుంటాయి.