iDreamPost
android-app
ios-app

యువతిపై కించపరిచేలా పోస్టులు.. ఎక్స్, గూగుల్ కంపెనీలకు హైకోర్టు నోటీసులు..

Delhi High Court Orders To Google, X To Removal Of Posts Against Anjali Birla: సోషల్ మీడియాలో పేరొందిన ప్రముఖులపై ఫేక్ పోస్టులు పెడుతుండడం మామూలే. తాజాగా ఓ యువతిపై కించపరిచేలా పోస్టులు పెట్టడంతో ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయ్యింది. గూగుల్, ఎక్స్ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది.

Delhi High Court Orders To Google, X To Removal Of Posts Against Anjali Birla: సోషల్ మీడియాలో పేరొందిన ప్రముఖులపై ఫేక్ పోస్టులు పెడుతుండడం మామూలే. తాజాగా ఓ యువతిపై కించపరిచేలా పోస్టులు పెట్టడంతో ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయ్యింది. గూగుల్, ఎక్స్ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది.

యువతిపై కించపరిచేలా పోస్టులు.. ఎక్స్, గూగుల్ కంపెనీలకు హైకోర్టు నోటీసులు..

సోషల్ మీడియాలో నిత్యం అనేక పోస్టులు వైరల్ అవుతుంటాయి. సెలబ్రిటీల గురించి, రాజకీయ నాయకుల గురించి ఫేక్ న్యూస్ లు కూడా వైరల్ అవుతుంటాయి. ఇందులో వ్యక్తిగతంగా దూషించే పోస్టులు, కించపరిచే పోస్టులు కూడా ఉంటాయి. అయితే వీటికి అడ్డూ, అదుపు లేకుండా పోతుంది. ఫేక్ అని తెలిసిన వాళ్ళు రిపోర్ట్ లు కొట్టి అటువంటి పోస్టులను తొలగించమని ఎక్స్ వేదికగా కోరుతుంటారు. అయితే ఉన్నతమైన హోదా కలిగిన వ్యక్తుల విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తే ఫలితాలు భిన్నంగా ఉంటాయి. తాజాగా ఓ యువతిని కించపరిచేలా పోస్టులు, కథనాలు గూగుల్, ఎక్స్ వేదికల్లో వైరల్ అయ్యాయి. తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆ యువతి పరువు తీసేలా కొందరు ఆమెపై కించపరిచే పోస్టులు పెట్టారు. అవి వైరల్ అవ్వడంతో ఢిల్లీ హైకోర్టు జోక్యం చేసుకుంది. గూగుల్, ఎక్స్ కంపెనీలకు నోటీసులు పంపింది. అసలేం జరిగిందంటే?

 గూగుల్, ఎక్స్ కంపెనీలకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు, ఐఆర్పీఎస్ అధికారి అంజలి బిర్లాను టార్గెట్ చేస్తూ, కించపరుస్తూ పెట్టిన పోస్టులను తొలగించాలని ఎక్స్, గూగుల్ సంస్థలకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంజలి బిర్లా పరువుకు భంగం కలిగేలా ఉన్న పోస్టులను 24 గంటల్లోగా తొలగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అంజలి బిర్లా.. తండ్రి ఓం బిర్లా పలుకుబడితో యూపీఎస్సీ క్లియర్ చేసిందని ఆరోపిస్తూ పలువురు నెటిజన్స్ పోస్టులు పెట్టారు. ఈ పోస్టులు వైరల్ అవ్వడంతో అంజలి బిర్లా దృష్టికి వెళ్ళింది. దీంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మొదటి ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్షలను తన తండ్రి పలుకుబడితో క్లియర్ చేశానని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని.. అదంతా అబద్ధమని ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు.

తనపై ఆరోపణలు చేస్తూ పెట్టిన పోస్టులు వెంటనే తొలగించాలని ఆమె హైకోర్టును కోరారు. ఈ పోస్టులు తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆమె అన్నారు. పలు సోషల్ మీడియా హ్యాండిల్స్ ఒక పక్కా ప్రణాళికతో తనపై కుట్ర పన్నుతున్నారని.. తన పరువు, తన తండ్రి పరువు తీయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. ఆమె తరపు న్యాయవాది 2019లో అంజలి బిర్లా యూపీఎస్సీ పరీక్షలు క్లియర్ చేశారని.. ఐఆర్పీఎస్ అధికారిగా ఇండియన్ రైల్వేస్ లో విధులు నిర్వహిస్తున్నారని ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేశారు. దీంతో ఢిల్లీ హైకోర్టు అంజలి బిర్లాపై పెట్టిన అభ్యంతరకర పోస్టులను వెంటనే తొలగించాలని ఎక్స్, గూగుల్ కంపెనీలకు నోటీసులు పంపించింది.            

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి