iDreamPost
android-app
ios-app

స్కూల్స్ కు సెలవులు పొడిగించిన విద్యాశాఖ

ప్రభుత్వం సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అసలు విషయం ఏంటంటే?

ప్రభుత్వం సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అసలు విషయం ఏంటంటే?

స్కూల్స్ కు సెలవులు పొడిగించిన విద్యాశాఖ

దీపావళి పండగ ఈ నెల 12న (ఆదివారం) కావడంతో సెలవు రాలేదని స్కూల్ విద్యార్థులు, కాలేజ్ స్టూండెట్స్ అందరూ నిరాశలో ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం సోమవారం అప్షన్ హాలీడేకి బదులు సాధారణ లీవ్ గా ప్రకటించింది. దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక తెలంగాణ విషయానికొస్తే.. ప్రభుత్వం సోమవారం సెలవు గురించి ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం విశేషం. తెలంగాణలో కూడా సోమవారం పండగ నేపథ్యంలో సాధారణ సెలవును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. ఢిల్లీ ప్రభుత్వం సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అసలు విషయం ఏంటంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత కొన్ని రోజుల నుంచి కాలుష్యం ఢిల్లీని కమ్మేసిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగానే ఢిల్లీ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై స్కూల్స్ కు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఇన్ని రోజులు గడిచినా పరిస్థితి మెరుగు పడకపోవడంతో తాజాగా ఢిల్లీ విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకంది. స్కూల్స్ కు సెలవులు మరిన్ని రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 9 నుంచి 18 వరకు విద్యార్థులకు సెలవులు పొడిగించినట్లు విద్యాశాఖ మంత్రి అతిషి తెలిపారు. అయితే ఇన్ని రోజులు గడిచినా వాయి కాలుష్యంలో తగ్గకపోవడంతో ఢిల్లీ ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుని ప్రజలను ప్రాణాలను రక్షించాలని జనాలు వేడుకొంటున్నారు.

ఢిల్లీలో ఇంతకు కూడా వాయికాలుష్యం తగ్గకపోవడంతో సుప్రింకోర్టు సైతం స్పందించి ఢిల్లీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే కాలుష్య నివారణకు తగిన పరిష్కారం కొనుగొనాలని తెలిపింది. అయితే ఈ క్రమంలోనే టెక్ మహేంద్ర X లో స్పందించి ఢిల్లీలొ కాలుష్య నివారణకు పలు సూచనలు చేశారు. కాలుష్యం తగ్గించడానికి రీజనరేటివ్ విధానం అన్ని విధాలుగా సహాయపడుతుందని,  దీంతో పాటు పంట వ్యర్థాలను దహనం చేసేందుకు  ఈ పద్దతి ఉపయోగపడుతుందని తెలిపారు. ఇంతే కాకుండా ఈ విధానం వల్ల నేల సారం కూడా పెరిగేందుకు తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు.