iDreamPost

మరి కొన్ని గంటల్లో వివాహం.. ఇంతలోనే కుప్పకూలిన పెళ్లి కుమార్తె

  • Published Jun 19, 2024 | 1:55 PMUpdated Jun 19, 2024 | 1:55 PM

మరి కొన్ని గంటల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టాల్సిన యువతి ఉన్నట్లుండి కుప్ప కూలింది. అసలింతకు ఏం జరిగింది.. నవ వధువుకు ఎలాంటి పరిస్థితి ఎదురయ్యింది అంటే..

మరి కొన్ని గంటల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టాల్సిన యువతి ఉన్నట్లుండి కుప్ప కూలింది. అసలింతకు ఏం జరిగింది.. నవ వధువుకు ఎలాంటి పరిస్థితి ఎదురయ్యింది అంటే..

  • Published Jun 19, 2024 | 1:55 PMUpdated Jun 19, 2024 | 1:55 PM
మరి కొన్ని గంటల్లో వివాహం.. ఇంతలోనే కుప్పకూలిన పెళ్లి కుమార్తె

పెళ్లీడుకొచ్చిన యువతీయువకులు వివాహం గురించి ఎన్నో కలలు కంటారు. తమను అన్ని విధాల అర్థం చేసుకునే భాగస్వామి రావాలని కోరుకుంటారు. అలానే పెళ్లి వేడుకకు సంబంధించి కూడా ఎన్నో ప్లాన్స్‌ చేసుకుంటారు. పెళ్లంటే జీవితంలో ఒక్కసారే జరిగే శుభకార్యం కావడంతో.. అప్పు చేసైనా సరే.. ఎంతో ఘనంగా వివాహం చేసుకోవాలని భావిస్తారు. ఇక నేటి కాలంలో పెళ్లి అంటే హల్దీ, మెహంద్‌, సంగీత్‌, బరాత్‌ ఇలా అనేక కార్యక్రమాలు ఉంటున్నాయి. కాస్త డబ్బున్న వాళ్లైతే.. మరో అడుగు ముందుకు వేసి సెలబ్రిటీల మాదిరి డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ప్లాన్‌ చేసుకుంటున్నారు.

ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువతి కూడా పెళ్లి గురించి ఇలానే కలలు కన్నది. కాస్త కలిగిన కుటుంబం కావడంతో.. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ప్లాన్‌ చేసుకుంది. మరి కొన్ని గంటల్లో మెడలో మూడు ముళ్లు పడి.. తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది అని ఆశిస్తున్న వేళ అనుకోని దారుణం చోటు చేసుకుంది. అప్పటి వరకు పెళ్లి సందడితో ఎంతో కోలాహలంగా కనిపించిన ఆ వేదికలో రోదనలు మిన్నంటాయి. ఇంతకీ ఏం జరిందంటే..

మరి కొన్ని గంటల్లో పెళ్లి చేసుకుని నూతన జీవితాన్ని ప్రాంభించాల్సిన యువతి.. అనూహ్య రీతిలో మృత్యువాతపడింది. డ్యాన్స్‌ చేస్తూ.. కుప్పకూలింది. దాంతో పెళ్లింట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌, నైనిటాల్‌లో చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన శ్రేయా జైన్‌ అనే యువతికి పెళ్లి కుదిరింది. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోవాలని భావించిన శ్రేయా.. నైనిటాల్‌లోని అత్యంత లగ్జరీ రిసార్ట్‌ నకుచియాటాల్‌ని తన వివాహానికి వేదికగా ఎన్నుకుంది. తల్లిదండ్రులు, బంధు మిత్రులతో కలిసి అక్కడకు చేరుకుంది. పెళ్లికి ముందు మెహందీ, సంగీత్‌ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈక్రమంలో మెహందీ వేడుకలో భాగంగా శ్రేయా ఉత్సాహంగా డ్యాన్స్‌ చేయసాగింది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న శ్రేయా డ్యాన్స్‌ చేస్తూనే కుప్పకూలింది.

ఈ సంఘటనతో అందరూ షాక్‌ అయ్యారు. వెంటనే వైద్యం అందించినప్పటికి లాభం లేకుండా పోయింది. అప్పటికే శ్రేయా మృతి చెందింది. మరి కొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన బిడ్డ ఇలా పాడె ఎక్కడం చూసి ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలాయి. అల్లారు ముద్దుగా పెంచుకుని.. అంగరంగ వైభవంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపాలని ఆశించిన బిడ్డను కాటికి పంపే వేళ ఆ తల్లిదండ్రులు అనుభవించిన నరకయాతన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక కన్నీటిని గుండెల్లోనే దాచుకుని.. బిడ్డకు అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఈ సందర్భంగా శ్రేయా తండ్రి మాట్లాడుతూ.. ‘‘నా కుమార్తె ఉన్నత చదువులు చదివింది. బీటెక్‌ తర్వాత ఎంబీఏ పూర్తి చేసింది. పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నది. ఆమెకు లక్నోలోని ఐటీ కంపెనీలో పని చేస్తోన్న యువకుడితో పెళ్లి నిశ్చయించి.. నైనిటాల్‌లో ఎంతో ఘనంగా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేయాలని భావించాము. కానీ ఇంతలోనే ఇలా జరిగింది. పెళ్లీ పీటలు ఎక్కాల్సిన నా బిడ్డ ఇలా పాడె ఎక్కుతుందని.. అత్తారింటికి పంపాల్సిన కుమార్తెను శ్మశానవాటికకు సాగనంపుతానని కల్లో కూడా అనుకోలేదు’’ అంటూ గుండెలు పగిలేలా ఏడ్చారు. కార్డియోపల్మోనరీ సమస్య వల్లే శ్రేయా మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి ఇలా మృత్యువాత పడటం ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి