iDreamPost
android-app
ios-app

నవంబర్‌ 10 వరకు స్కూల్స్‌కి సెలవులు.. వారికి మాత్రం ఆన్‌లైన్‌ క్లాస్‌లు

  • Published Nov 05, 2023 | 1:44 PM Updated Updated Nov 05, 2023 | 1:44 PM

నవంబర్‌ 10 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఏ ప్రభుత్వం.. ఎందుకు సెలవులు ఇచ్చింది అంటే..

నవంబర్‌ 10 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఏ ప్రభుత్వం.. ఎందుకు సెలవులు ఇచ్చింది అంటే..

  • Published Nov 05, 2023 | 1:44 PMUpdated Nov 05, 2023 | 1:44 PM
నవంబర్‌ 10 వరకు స్కూల్స్‌కి సెలవులు.. వారికి మాత్రం ఆన్‌లైన్‌ క్లాస్‌లు

టైటిల్‌ చూడగానే.. అదేంటి మొన్నే కదా దసరా సెలవులు అయిపోయాయి.. మళ్లీ అప్పుడే హాలీడేస్‌ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ సెలవుల ప్రకటన మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినది కాదు. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న పాఠశాలలకు వర్తిస్తుంది. హస్తినలో నవంబర్‌ 10 వరకు బళ్లకు సెలవులు ప్రకటించారు. కారణం ఏంటి అంటే.. వాయు కాలుష్యం. ఢిల్లీ వాయు కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం నగరంలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ఇంట్లో ఉన్నప్పటికి కూడా ప్రజలకు ఇబ్బంది తప్పడం లేదు. ఢిల్లీ వాసులు ఊపిరి పీల్చుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ ప్రభుత్వం నవంబర్‌ 5 వరకు స్కూల్స్‌కి సెలవులు ప్రకటించింది. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో.. తాజాగా వాటిని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

వాయు కాలుష్యం నేపథ్యంలో.. ఢిల్లీ ప్రభుత్వం తొలుత నవంబరు 5 వరకూ పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. కానీ పరిస్థితి మరింత దిగజారడంతో నవంబరు 10 వరకూ పొడిగిస్తూ.. తాజాగా నిర్ణయం తీసుకుంది ‘‘కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉన్నందున ఢిల్లీలోని ప్రాథమిక పాఠశాలలు నవంబర్ 10 వరకు మూసివేస్తున్నాం. 6-12 గ్రేడ్ పాఠశాలలకు ఆన్‌లైన్ తరగతులకు మారే అవకాశం ఇస్తున్నాం’’ అని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతీశ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలో వరుసగా ఆరో రోజు ఆదివారం ఉదయం వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 460గా నమోదయ్యింది.

పడిపోతున్న ఉష్ణోగ్రతలు, కాలుష్య వ్యాప్తిని అణిచివేసే స్తబ్దత గాలులు, పంజాబ్, హరియాణాలో పంట కోత అనంతర వరి కంకులు తగులబెట్టడం వల్ల ఢిల్లీలో గాలి నాణ్యత గత వారం రోజుల నుంచి క్షీణిస్తూ వస్తుంది. కేంద్ర కాలుష్య నివారణ బోర్డ్‌ డేటా ప్రకారం.. ఢిల్లీలో అక్టోబర్ 27- నవంబర్ 3 మధ్య గాలి నాణ్యత ఇండెక్స్‌ సూచి 200 పాయింట్లకు పైగా పెరిగింది.

శుక్రవారం అత్యంత తీవత్ర కేటగిరీకి పడిపోయింది. ఇక, ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన వాయు కాలుష్యం ఉన్న రాజధానిల్లో ఢిల్లీ ఒకటిగా నిలిచినట్లు యూనివర్సిటీ ఆఫ్ చికాగో నివేదిక వెల్లడించింది. దీని కారణంగా ఢిల్లీ ప్రజల జీవితకాలం 12 ఏళ్ల తగ్గిపోతుందని హెచ్చరించింది.