iDreamPost
android-app
ios-app

ప్రభుత్వ ఉచిత డిష్‌ సర్వీస్‌.. ఇక రీఛార్జ్‌ చేయకుండానే TV చూడొచ్చు

  • Published May 25, 2024 | 12:25 PM Updated Updated May 25, 2024 | 12:25 PM

Free Dish DTH Service: టీవీ చూడాలంటే ప్రతి నెల రీఛార్జ్‌ చేయాల్సి ఉంటుంది. కానీ మన దేశంలో మొట్టమొదటి, ఏకైక ఉచిత టూ ఎయిర్ (ఎఫ్‌టీఏ) డైరెక్ట్-టు-హోమ్ (డీటీహెచ్‌) సర్వీస్‌ అందుబాటులో ఉంది. దాని వివరాలు..

Free Dish DTH Service: టీవీ చూడాలంటే ప్రతి నెల రీఛార్జ్‌ చేయాల్సి ఉంటుంది. కానీ మన దేశంలో మొట్టమొదటి, ఏకైక ఉచిత టూ ఎయిర్ (ఎఫ్‌టీఏ) డైరెక్ట్-టు-హోమ్ (డీటీహెచ్‌) సర్వీస్‌ అందుబాటులో ఉంది. దాని వివరాలు..

  • Published May 25, 2024 | 12:25 PMUpdated May 25, 2024 | 12:25 PM
ప్రభుత్వ ఉచిత డిష్‌ సర్వీస్‌.. ఇక రీఛార్జ్‌ చేయకుండానే TV చూడొచ్చు

స్మార్ట్‌ ఫోన్‌ల వినియోగం ఎంత పెరిగినా.. నేటికి కూడా ప్రజలకు అత్యుత్తమ వినోద సాధనం అంటే టీవీనే అంటారు. ఓటీటీలు, స్మార్ట్‌ ఫోన్‌లు వీటిని ఎక్కువగా యువత వినియోగిస్తుంటారు. కాస్త వయసు మళ్లిన వారికి, ఇంటి వద్దనే ఉండే మహిళలకు మంచి వినోద సాధనం అంటే టీవీనే అని చెప్పవచ్చు. ఇక సీరియల్స్‌కు ఉండే ఆదరణ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే టీవీ చూడాలంటే.. కచ్చితంగా ఏదో ఒక సెట్‌ టాప్‌ బాక్స్‌ ఉండాలి.. పైగా ప్రతి నెలా రీచార్జ్‌ చేయాలి. మనకు నచ్చిన ప్యాక్‌ను సెలక్ట్‌ చేసుకుని.. దానికి ఎంత అమౌంట్‌ కావాలో అంత కట్టాలి. సామాన్యులు, పేదలకు ఇది అదనపు భారం అనే చెప్పవచ్చు. అయితే ఈ సమస్య పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఉచితంగా డిష్‌ కనెక్షన్‌ అందించేందుకు రెడీ అయ్యింది. దీని వల్ల రీఛార్జ్‌ చేయకుండానే టీవీ చూడొచ్చు అన్నమాట. ఆ వివరాలు..

కేంద్ర ప్రభుత్వం ఉచితంగా డిష్‌ కనెక్షన్‌ అందిచేందుకు ముందుకు వచ్చింది. దీని వల్ల ఇకపై ఎలాంటి రీఛార్జ్‌ లేకుండా ఉచితంగా టీవీ చూడవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం ఉచితంగా డిష్‌ కనెక్షన్‌ అందిస్తుంది. డీడీ ప్రసార భారతి ద్వారా ప్రభుత్వం ఈ ఉచిత డిష్‌ డీటీహెచ్‌ సేవలను అందిస్తుంది. పబ్లిక్‌ సర్వీస్‌ బ్రాడ్‌కాస్టర్‌ ప్రసార భారతి ద్వారా ఈ సేవలను అందిస్తుంది. ఇది భారతదేశపు మొట్టమొదటి, ఏకైక ఉచిత టూ ఎయిర్ (ఎఫ్‌టీఏ) డైరెక్ట్-టు-హోమ్ (డీటీహెచ్‌) సర్వీస్‌. దీన్ని డిసెంబర్, 2004లో ప్రారంభించారు.

దీని కోసం మీరు ఒక్కసారి 2 వేల రూపాయలు ఖర్చు చేస్తే చాలు. ఆ తర్వాత రీఛార్జ్‌ చేయాల్సిన అవసరం లేదు. ఈ 2 వేల రూపాయలు కూడా సెట్‌ టు బాక్స్‌, డిష్‌ యాంటెన్నా కొనుగోలు కోసం మాత్రం. ఇక ఈ ఉచిత డిష్‌ సేవలను పొందాలనుకుంటే.. మీరు 1800114554 లేదా 011-25806200 అనే రెండు నంబర్లను సంప్రదించాలి. అలానే మీకు సమీపంలోని ఏదైనా కేబుల్‌ ఆపరేట్‌ నుంచి కూడా ఈ సర్వీసును ఇన్‌స్టాల్‌ చేసుకుని.. ఉచిత సేవలను పొందవదచ్చు. ఇక ఈ డిష్‌ను ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత.. ప్రతి నెల రీఛార్జ్‌ చేయాల్సిన బాధ ఉండదు.

కాకపోతే ఇక్కడ మీరు అన్ని ఛానెల్స్‌ను చూడలేరు. కేవలం ఈ ప్యాక్‌లో ఉన్న ఛానెల్స్‌ను మాత్రమే ఫ్రీగా చూడవచ్చు. మిగతా వాటిని కూడా చూడాలంటే.. అప్పుడు డబ్బులు చెల్లించాలి. ఇక డీడీ ఫ్రీ డిష్‌ ప్యాక్‌లో అన్నీ దూరదర్శన్‌ ఛానెల్స్‌.. వేర్వేరు జానర్లు అనగా జీఈసీ, సినిమాలు, మ్యూజిక్‌, క్రీడలు, వార్తలు, కరెంట్‌ అఫైర్స్‌, ఆ‍ధ్యాత్మికం, ఆయుష్‌ వంటి వాటికి చెందిన ప్రైవేట్‌ టీవీ ఛానెల్స్‌, వేర్వేరు భారతీయ భాషా ఛానల్స్‌, ఇంగ్లీష్‌, ఎడ్యుకేషనల్‌ ఛానెల్స్‌, ఆల్‌ ఇండియా రేడియోకు చెందిన రేడియో ఛానెల్స్‌ అందుబాటులో ఉంటాయి. ఇవన్ని ఉచితంగానే చూడవచ్చు. వేరే ఛానెల్స్‌ కావలంటే.. డబ్బులు చెల్లించాలి.