iDreamPost
android-app
ios-app

Dawood Ibrahim: వేలానికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్‌ ఇబ్రహీం చిన్ననాటి ఇల్లు!

  • Published Jan 02, 2024 | 3:44 PM Updated Updated Jan 02, 2024 | 3:44 PM

ముంబైని గడ గడలాడించి ఎన్నో నేరాలకు పాల్పపడిన మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం.. 1993లో ముంబైలో బాంబు పేలుళ్లకు ప్రధాన సూత్రదారిగా వ్యవహరించారు. ఈ ఘటనలో 257 మంది చనిపోయారు.. వందల సంఖ్యల్లో గాయాలపాలయ్యారు.

ముంబైని గడ గడలాడించి ఎన్నో నేరాలకు పాల్పపడిన మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం.. 1993లో ముంబైలో బాంబు పేలుళ్లకు ప్రధాన సూత్రదారిగా వ్యవహరించారు. ఈ ఘటనలో 257 మంది చనిపోయారు.. వందల సంఖ్యల్లో గాయాలపాలయ్యారు.

Dawood Ibrahim: వేలానికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్‌ ఇబ్రహీం చిన్ననాటి ఇల్లు!

అండర్ వరల్డ్ డాన్.. ఇండియన్ మోస్ట్ వాంటెడె క్రిమినల్ దావూద్ ఇబ్రహీం గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. 1993 లో ముంబైలో బాంబు పేలుళ్లతో మారణహోమం సృష్టించాడు.ఈ ఘటనలో ఎంతోమంది అమాయకులు చనిపోయారు.. వందల మంది వికాలాంగులుగా మారారు. కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ముంబై పేలుళ్ల తర్వాత దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ పారిపోయాడు. దాదాపు 25 సంవత్సరాల నుంచి బయటి ప్రపంచానికి కనిపించకుండా తన నెట్ వర్క్ ని నడిపిస్తున్నాడు. ఇప్పటికీ పలు దేశాల్లో డీ కంపెనీ వ్యవహారాలు కొనసాగుతూనే ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇటీవల దావూద్ పై విషప్రయోగం జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. తాజాగా దావూద్ ఇబ్రహీం కి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, ముంబై పేలుళ్ళ ముఖ్య సూత్రదారి దావూద్ ఇబ్రహీం కు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 1993 ముంబై పెలుళ్ల తర్వాత దావూద్ భారత దేశం వదిలి పాకిస్థాన్ పారిపోయాడు.. అక్కడ కరాచీలో నివాసం ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆయనపై విష ప్రయోగం జరగడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇవి అసత్యాలు అని కొన్ని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా భారత్ ప్రభుత్వం దావూద్ చిన్ననాటి ఇంటిని వేలం వేయనున్నట్లు ప్రకటించింది. దావూద్ తన బాల్యం ఈ ఇంటిలోనే గడిపారు. అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన నాలుగు ప్రాపర్టీలు, వ్యవసాయ భూమి ముంబాకే గ్రామంలో ఉన్నాయి.

ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్ చట్టం, 1976 కింద దావూద్ ఆస్తులను కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాయి. వీటిని ఇప్పుడు వేలం వేయడానికి నిర్ణయించారు.
గతంలో దావూద్, అతని కుటుంబానికి చెందిన పదకొండు ఆస్తులను అధికారులు వేలం వేసిన విషయం తెలిసిందే.. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. దావూద్ 1983లో ముంబైకి రాకముందు ముంబాకే గ్రామంలో నివసించారు. ఆయన తండ్రి ఒక పోలీస్. చిన్ననాటి నుంచే నేరప్రవృత్తిని ఎంచుకున్న దావూద్.. డీ గ్యాంగ్ ఏర్పాటు చేసి అంచలంచెలుగా ఎదిగాడు. దేశంలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినట్, మాఫియా సామ్రాజ్యానికి డాన్ గా మారాడు.