దర్శన్‌కి ప్రత్యేక సౌకర్యాలు కట్.. ఒంటరిగా మిగిలిపోయిన పవిత్ర గౌడ

Darshan, Pavithra Gowda: అభిమానిని చంపిన కేసులో నిందితులుగా ఉన్న హీరో దర్శన్, నటి పవిత్ర గౌడలను ఒకే జైల్లో ఉంచిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ ఇద్దరినీ వేరు వేరు జైళ్లలో పెట్టినట్లు తెలుస్తోంది. పవిత్ర గౌడ ఉన్న జైలు నుంచి దర్శన్ ను వేరే జైలుకి తరలించినట్లు సమాచారం.

Darshan, Pavithra Gowda: అభిమానిని చంపిన కేసులో నిందితులుగా ఉన్న హీరో దర్శన్, నటి పవిత్ర గౌడలను ఒకే జైల్లో ఉంచిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ ఇద్దరినీ వేరు వేరు జైళ్లలో పెట్టినట్లు తెలుస్తోంది. పవిత్ర గౌడ ఉన్న జైలు నుంచి దర్శన్ ను వేరే జైలుకి తరలించినట్లు సమాచారం.

కర్ణాటకలోని చిత్రదుర్గకి చెందిన రేణుక స్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్, నటి పవిత్ర గౌడ తదితరులు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దర్శన్ ను బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే జైల్లో దర్శన్ లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడని.. అతనికి రాచమర్యాదలు చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో దర్శన్ ను అగ్రహార సెంట్రల్ జైలు నుంచి భారీ బందోబస్తు మధ్య బళ్ళారి సెంట్రల్ జైలుకు తరలించారు. బళ్లారి సెంట్రల్ జైల్లో దర్శన్ కి ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించకూడదని.. సాధారణ విచారణ ఖైదీలానే చూడాలని బళ్లారి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ కి జైళ్ల శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా బళ్లారి సెంట్రల్ జైలు పరిసర ప్రాంతాలకు దర్శన్ అభిమానులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇక ఇదే కేసులో అరెస్ట్ అయిన నటి పవిత్ర గౌడను మినహాయించి మిగతా నిందితులను కూడా కర్ణాటకలోని పలు జైళ్లకు తరలించారు. కాగా నటి పవిత్ర గౌడ మాత్రం పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోనే ఒంటరిగా మిగిలిపోయింది. పవిత్ర గౌడకి కూడా ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించకూడదని జైళ్ల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆమెను కూడా సాధారణ విచారణ ఖైదీలానే చూడాలని బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రీసెంట్ గా పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు ఆవరణలో దర్శన్, బెంగళూరుకు చెందిన కొందరు రౌడీ షీటర్లు కలిసి కాఫీలు, సిగరెట్లు తాగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరకూ వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారు.

ఇక కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్ పరమేశ్వర్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లి వివరాలు సేకరించి.. ప్రత్యేక కోర్టు అనుమతితో బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న నటి పవిత్ర గౌడ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. తనకు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదని.. సాధారణ ఖైదీలా చూస్తున్నారని వాపోయినట్లు సమాచారం. దర్శన్ కి వీరాభిమాని అయిన రేణుకా స్వామిని.. తన అభిమాన హీరో చేతిలోనే అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. దర్శన్ ప్రియురాలికి అసభ్యకరమైన మెసేజులు, కామెంట్స్ తో ఇబ్బంది పెడుతున్నాడన్న కారణంతో రేణుక స్వామిని కిడ్నాప్ చేయించి కొంతమందికి సుపారీ ఇచ్చి మరీ చంపించారు దర్శన్, పవిత్ర గౌడలు. హత్య చేయించింది దర్శన్, పవిత్ర గౌడలే అని నిర్ధారణ కావడంతో ఇరువురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరితో పాటు ఈ హత్యలో నిందితులుగా ఉన్న మరో 13 మందిని అరెస్ట్ చేశారు.

Show comments