iDreamPost
android-app
ios-app

ఫుడ్‌ డెలివరీ అంటూ కాల్‌.. లిఫ్ట్‌ చేసినందుకు వేలల్లో మోసం

  • Published Feb 21, 2024 | 12:35 PM Updated Updated Feb 21, 2024 | 12:35 PM

ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్ల మోసాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. తరచూ ఏదో ఒక రూపంలో అమాయక ప్రజలను ఈ కేటుగాళ్లు మోసం చేస్తునే ఉన్నారు. తాజాగా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పేరుతో భారీ మోసం. అదేలాంటే..

ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్ల మోసాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. తరచూ ఏదో ఒక రూపంలో అమాయక ప్రజలను ఈ కేటుగాళ్లు మోసం చేస్తునే ఉన్నారు. తాజాగా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పేరుతో భారీ మోసం. అదేలాంటే..

  • Published Feb 21, 2024 | 12:35 PMUpdated Feb 21, 2024 | 12:35 PM
ఫుడ్‌ డెలివరీ అంటూ కాల్‌.. లిఫ్ట్‌ చేసినందుకు వేలల్లో మోసం

దేశంలో సైబర్ నేరగాళ్ల మోసాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. తరచూ ఏదో ఒక రూపంలో అమాయక ప్రజలను మోసం చేస్తూ.. వారి దగ్గర భారీ మొత్తంలో నగదును కాజేసుకుంటున్నారు. ఈ విషయంలో అధికారులు ప్రజలను ఎంత అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తున్నా.. జాగ్రత్త అనే మాట తప్ప, మోసపోయే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఆధునిక టెక్నాలజీ సహాయంతో అనేక ప్రయోజనాలతో పాటు నష్టాలను కూడా తెచ్చిపెడుతుంది. వీటివలన హ్యాకర్లు, సైబర్‌ మోసగాళ్ళు మోసం చేయడానికి మార్గాలు అనేవి సులభం అవుతోంది. తాజాగా ఇలాంటి టెక్నాలజీ సహాయంతో మరో సైబర్ నేరం అనేది వెలుగులోకి వచ్చింది. IVR సిస్టమ్ ద్వారా రికార్డింగ్ కాల్ రావడంతో క్షణాల్లో ఖాతా నుంచి అన్ని లక్షలు మాయం. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఈ మధ్యకాలంలో టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందడంతో ఇది సైబర్ మోసగాళ్లుకు మోసాలకు పునాదిలా మారింది. దీంతో అత్యంత సులభంగా సైబర్ నేరగాళ్ల మోసాలు సులభం అవుతున్నాయి. ముఖ్యంగా IVR సిస్టమ్ ద్వారా ప్రజలకు కాల్ వచ్చినప్పుడు రికార్డ్ చేయబడిన వాయిస్‌ను వినండి. ఎందుకంటే.. దీని ద్వారా హ్యాకర్లు భారీ మొత్తంలో నగదును కొల్లగొడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఢిల్లీలో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢీల్లీకి చెందిన 26 ఏళ్ల మహిళ వ్యాపారవేత్తకు.. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ నుంచి ఆటోమేటెడ్ కాల్ వచ్చింది. దీంతో ఆ మహిళ ఆ కాల్ ని లిఫ్ట్ చేసి మాట్లాడినందుకు గాను..  వెంటనే ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.97,000 లు మాయమైయ్యాయి. దీంతో వెంటనే గ్రహించిన ఆ మహిళ స్థానిక సైబర్ పోలీలుసులను ఆశ్రయించింది. కాగా, రంగంలోకి దిగిన సైబర్ పోలీసులు విచారణలొ భాగంగా మాజీ డెలివరీ బాయ్ తో పాటు అతని గ్యాంగ్ కు సంబంధించిన మోసం బయటపడింది. ఇందులో అతని సహచరులలో ఒకరు ప్రమేయం ఉండగా.. అతడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే, చాలా మంది ప్రజలు ఆన్‌లైన్‌లో ఆహారాన్ని తరచుగా ఆర్డర్ చేస్తారు. అలాంటప్పుడు ఇలాంటి కాల్స్‌ను స్వీకరించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే.. IVR వ్యవస్థ ద్వారా.. ఫుడ్ డెలివరీ యాప్‌తో లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేయడానికి సైబర్ నేరగాళ్లు (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది స్వయంచాలక టెలిఫోన్ వ్యవస్థ. ఇది ముందుగా రికార్డ్ చేయబడిన సందేశాలతో సహా అనేక ఇంటర్‌ఫేస్‌లను కలిగి ఉంటుంది. కనుక వీటిని నిర్లక్ష్యం చేయడం వలన ప్రజలు భారీ నష్టాలకు గురవుతారు. కాబట్టి ఈ కొత్త తరహా సైబర్ నేరాలు, మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజలు సూచిస్తున్నారు. మరి, ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ ద్వార సైబర్ నేరగాళ్ల మోసాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.