Krishna Kowshik
పిల్లల్ని చదువుకోమని పంపిస్తుంటే.. కాలేజీలు బంక్ కొట్టి.. తల్లిదండ్రులకు, లెక్చరర్లకు పంగనామాలు పెడుతుంటారు. దీంతో చదువులు అటక ఎక్కుతుంటాయి. పరీక్షల సయమంలో కాపీలు కొట్టడం, చీట్లు పెట్టడాలు చేస్తుంటారు. ఇవే వారి కొంపకు తెస్తాయి.
పిల్లల్ని చదువుకోమని పంపిస్తుంటే.. కాలేజీలు బంక్ కొట్టి.. తల్లిదండ్రులకు, లెక్చరర్లకు పంగనామాలు పెడుతుంటారు. దీంతో చదువులు అటక ఎక్కుతుంటాయి. పరీక్షల సయమంలో కాపీలు కొట్టడం, చీట్లు పెట్టడాలు చేస్తుంటారు. ఇవే వారి కొంపకు తెస్తాయి.
Krishna Kowshik
పిల్లల్ని ఉన్నత చదువులు చదివించేందుకు తల్లిదండ్రులు కష్టపడి పనిచేస్తుంటారు. తమ కడుపు మాడ్చుకుని పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతుంటారు. తమలా కష్టపడకూడదన్న ఉద్దేశంతో ఏదీ చదువుతామంటే.. వారి ఇష్టాలను కాదనరు. ఏదీ కావాలన్నా కొనిపెడుతుంటారు. కానీ కాలేజీలకు వెళ్లాక.. తల్లిదండ్రుల కష్టాన్ని మరచి ఇష్టాను సారంగా ప్రవర్తిస్తుంటారు కొంత మంది విద్యార్థులు. సినిమాలు, షికార్లు అంటూ కాలేజీలు బంక్ కొట్టడాలు, పరీక్షల సమయంలో కాపీలు పెట్టడాలు, కొట్టడాలు వంటివి చేస్తుంటారు. అటువంటి విద్యార్థుల పట్ల కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఇది అవమానంగా భావించి విద్యార్థఉలు కాలేజీ మానేయడం లేదంటే జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు.
మాన్యది కూడా ఇదే వరుస. కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని చెన్నరాయపట్నం తాలుకాలోని హోన్నశెట్టిహళ్లి గ్రామ నివాసి మాన్య. నగర శివారల్లోని రాజీవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే ఇటీవల ఇంటర్నల్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కాపీ కొట్డడానికి ప్రయత్నించింది మాన్య. ఈ విషయాన్ని గమనించిన ఇన్విజిలేటర్.. ఆమె పేపర్ తీసుకుని.. బయటకు పంపించేశారు. ఈ విషయాన్ని కాలేజీ ప్రిన్సిపల్‌కు చెప్పాడు. మాన్యను పిలిపించిన ప్రిన్సిపల్.. ఆమెను మందలించారు. ఈ విషయాన్ని డిబార్ చేస్తామని, తల్లిదండ్రలను పిలవాలని చెప్పారు. ఈసారి ఇలా చేయనంటూ వేడుకుంది.
ఇక ఇలా చేయనని క్షమాపణ పత్రం రాసివ్వాలని మాన్యకు చెప్పారు ప్రిన్సిపల్. లెక్చరర్లు కూడా ఇదే పాట పాడటంతో ఆమె అవమానంగా భావించింది. ఇదే అవమానంతో.. కళాశాల ఐదో అంతస్తు పైకి వెళ్లి అక్కడి నుండి దూకేసింది. 5 అంతస్థుల నుండి పడిపోవడంతో అక్కడిక్కడే మరణించింది మాన్య. ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాన్య మరణం తెలిసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు.