iDreamPost
android-app
ios-app

ఆమె స్కూల్ టీచర్.. రాత్రైనా ఇంటికి రాకపోయేసరికి!

అందమైన జీవితం.. గౌరప్రదమైన ఉద్యోగం. రోజులానే.. స్కూటీపై స్కూల్‌కు వెళ్లిన టీచరమ్మ.. మధ్యాహ్నం బడి అయిపోగానే బండిపై బయలు దేరింది. అయితే రాత్రైనా ఇంటికి చేరుకోలేదు. తీరా చూస్తే..

అందమైన జీవితం.. గౌరప్రదమైన ఉద్యోగం. రోజులానే.. స్కూటీపై స్కూల్‌కు వెళ్లిన టీచరమ్మ.. మధ్యాహ్నం బడి అయిపోగానే బండిపై బయలు దేరింది. అయితే రాత్రైనా ఇంటికి చేరుకోలేదు. తీరా చూస్తే..

ఆమె స్కూల్  టీచర్.. రాత్రైనా ఇంటికి రాకపోయేసరికి!

కొన్ని సంఘటనలు అనుమానాస్పదంగా మిగిలిపోతుంటాయి. అసలు ఏం జరిగిందో తెలియడానికి కాస్త సమయం పడుతుంది .. కానీ ఈ లోగా డౌట్స్ గా ఉండిపోతుంటాయి. ఇది ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ విషయంలో అదే జరిగింది. యథావిధిగా గత శనివారం ఉద్యోగానికి వెళ్లిన ఈ ఫోటోలోని మహిళ.. మధ్యాహ్నం ఇంటికి స్కూటర్ పై బయలు దేరింది. కానీ రాత్రైనా నివాసానికి చేరుకోలేదు. ఏం అయ్యిందో తల్లిదండ్రులకు సమాచారం లేదు. అయితే ఆమె స్కూటర్ ఓ ప్రాంతంలో కనిపించడంతో.. ఎవరిదో తెలియక స్థానిక గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ స్కూటర్ సీజ్ చేసి బండి నంబర్ సాయంతో ట్రేస్ చేశారు. చివరకు ఆ మహిళ తండ్రికి ఫోన్ చేయడంతో అప్పుడు తెలిసింది ఆ స్కూటర్ దీపికది అని.

ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు దీపిక. కర్ణాటకలోని మాణిక్యన హళ్లికి చెందిన వెంకటేష్ కుమార్తె అయిన దీపికకు లోకేష్ అనే యువకుడితో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి బంగారం లాంటి పాప పుట్టింది. ప్రస్తుతం దీపిక ఎస్ఈటీ పబ్లిక్ పాఠశాలలో గెస్ట్ టీచర్‌ గా పనిచేస్తోంది. శనివారం ఉదయం స్కూల్‌ కు వెళ్లి.. మధ్యాహ్నం తిరిగి ఇంటికి పయనం అయ్యింది. స్కూటీపై బయలుదేరింది. అయినా ఇంటికి చేరుకోలేదు. ఏం జరిగిందో భర్తకు కూడా తెలియలేదు. అయితే మేలుకోటేలోని యోగా నరసింహస్వామి కొండ దిగువన దీపిక స్కూటర్ ఉండటం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫోన్ చేయడం.. వారు ఘటనా స్థలానికి వచ్చి బండి సీజ్ చేసి.. నంబర్ ఆధారంగా ఆమె వివరాలు కనుక్కుని.. తండ్రికి ఫోన్ చేస్తే ఆమె కనిపించడం లేదన్న విషయం బయటకు వచ్చింది.

ఇక స్కూటర్ దొరికిన ప్రాంతంలోనే పోలీసులు వెతకసాగారు. వెతకగా.. కొండ దిగువన మట్టిలో పూడ్చి పెట్టిన టీచర్ దీపిక మృతదేహం కనిపించింది. ఈ విషయం తెలిసి మహిళ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఆమెను ఎవరో హత్య చేసి.. నరసింహ స్వామి బెట్ట దిగువన ఖాళీ స్థలంలో ఆమె మృతదేహాన్ని పూడ్చి పెట్టారని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం అనంతరం హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. పోలీసులు ఆగంతకుల కోసం వేట మొదలుపెట్టారు. ఆమెను హత్య చేయడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.