iDreamPost
android-app
ios-app

వీడియో: మెట్రో రైల్లో జంట రొమాన్స్‌.. ఇచ్చి పడేసిన మహిళ!

  • Published Sep 08, 2023 | 1:49 PM Updated Updated Sep 08, 2023 | 1:49 PM
  • Published Sep 08, 2023 | 1:49 PMUpdated Sep 08, 2023 | 1:49 PM
వీడియో: మెట్రో రైల్లో జంట రొమాన్స్‌.. ఇచ్చి పడేసిన మహిళ!

ఈ మధ్య కాలంలో మైట్రో రైల్లో పిచ్చి పిచ్చి పనులు ఎక్కువయిపోయాయి. నిత్యం వేల మంది ప్రయాణించే రైళ్లలో కొంతమంది అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. చూట్టూ పదుల సంఖ్యలో జనాలు ఉన్నా సరే రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. నిత్యం మెట్రో రైలుకు సంబంధించిన వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. మెట్రో రైల్లో గొడవలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, మెట్రో రైల్లో ఓ జంటకు మహిళకు మధ్య గొడవ చోటుచేసుకుంది.

రొమాన్స్‌ చేసుకుంటున్న వారికి ఆ మహిళ మాస్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఓ మహిళ కొద్దిరోజుల క్రితం మెట్రో రైలు ఎక్కింది. రైలులో ఉండగా ఓ జంట రొమాన్స్‌ చేసుకుంటూ కనిపించింది. దీంతో మహిళకు కోపం వచ్చింది. వారితో గొడవ పెట్టుకుంది. ‘‘నేను గంట నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. ఆమె ఏం చేస్తోంది. నీ బుగ్గలు ముట్టుకుంటోంది. హత్తుకుంటోంది. ఏమేమో చేస్తోంది. ఇదే బాగోలేదు. ఇలాంటి ఏవైనా చేయాలనుకుంటే బయటకు వెళ్లి చేసుకోండి’ అంటూ మండిపడింది.

ఆ జంట కూడా ఆమెకు పోటీగా కామెంట్లు చేసింది. కొద్దిసేపటి తర్వాత ఎవరి స్టేషన్‌లో వాళ్లు దిగిపోయారు. ఇక, ఇందుకు సంబంధించిన వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. సదరు జంటపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఇలా పాడు పనులు చేయటం ఏంటంటూ మండిపడుతున్నారు. మరి, మెట్రో రైల్లో రొమాన్స్‌ చేస్తూ మహిళతో తిట్లు తిన్న ఈ జంటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio