Dharani
Dharani
గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తరచుగా అనారోగ్యాఇనకి గురవుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా నేడు మరోసారి సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. సోనియా గాంధీకి తేలికపాటి జ్వరం లక్షణాలు కనిపించడంతో వెంటనే ఆమెను.. ఢిల్లీలోని సర్ గంగారమ్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఇక ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సార్లు సోనియాగాంధీ ఆస్పత్రిలో చేరారు. వైరల్ రెస్పటరీ ఇన్ఫెక్షన్ చికిత్స కోసం ఈ ఏడాది జనవరిలో సోనియాగాంధీ సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత మళ్లీ మార్చి 2న జ్వరం కారణంగా మరోసారి ఇది ఆస్పత్రిలో చేరారు సోనియా గాంధీ. ఇక తాజాగా మరోసారి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు సోనియా గాంధీ
బీజేపీ, ఎన్డీఏ కూటమి ఓటమే లక్ష్యంగా.. దేశంలోని విపక్షాలు అన్ని కలిసి.. ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కూటమిలో.. కాంగ్రెస్ పార్టీ కీలకంగా ఉంది. ఇక ఇటీవల ముంబై వేదికగా ఈ కూటమి మూడో సమావేశం.. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 రెండు రోజులు పాటు జరిగింది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ కూడా హాజరయ్యారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా, బీజేపీని 2024లో మళ్లీ అధికారంలోకి రాకుండా చేసేందుకు ఇండియా కూటమి తీవ్రంగా కృషి చేస్తోంది.