Keerthi
తాజాగా ఓ ప్రముఖ కంపెనీ క్యాంటీన్ లో సాయంత్రం సమోసా తినేందుకు వెళ్లగా.. అక్కడ సమోసాలో ఆలు, ఉల్లిగడ్డ, ఇతర మసాలాలకు బదులుగా రకరకాల వస్తువులు దర్శనమిచ్చాయి. ఇక ఆ సమోసాలను తింటుండుగా వాటి నుంచే వచ్చే ఆ భయంకరమైన వస్తువులను చూసి కంపెనీ ఉద్యోగస్తులు ఖంగుతిన్నారు. ఇంతకి ఈ భయంకరమైన ఘటన ఎక్కడ జరిగిదంటే..
తాజాగా ఓ ప్రముఖ కంపెనీ క్యాంటీన్ లో సాయంత్రం సమోసా తినేందుకు వెళ్లగా.. అక్కడ సమోసాలో ఆలు, ఉల్లిగడ్డ, ఇతర మసాలాలకు బదులుగా రకరకాల వస్తువులు దర్శనమిచ్చాయి. ఇక ఆ సమోసాలను తింటుండుగా వాటి నుంచే వచ్చే ఆ భయంకరమైన వస్తువులను చూసి కంపెనీ ఉద్యోగస్తులు ఖంగుతిన్నారు. ఇంతకి ఈ భయంకరమైన ఘటన ఎక్కడ జరిగిదంటే..
Keerthi
క్షణం కూడా తీరిక లేకుండా బిజీ లైఫ్ ను గడుపుతున్న ప్రతిఒక్కరూ ఈ మధ్య ఇంట్లో ఫడ్ కన్నా.. బయట ఫుడ్స్ కే ఎక్కువగా ఆలవాటు పడిపోతున్నారు. ఈ క్రమంలోనే చాలామంది.. ఆన్ లైన్ ఫుడ్ అని, రెస్టారెంట్ , క్యాంటిన్ ఫుడ్ అంటూ బయట తినడనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో.. ఇలా బయట ఫుడ్ తినే చాలామందికి ఎదురవుతన్న చేధు అనుభావాల గురించి వింటునే ఉన్నాం. ముఖ్యంగా.. ష్టంగా ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ లో ఊహించని భయంకర సంఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి.అయితే తాజాగా ఓ ప్రముఖ కంపెనీ క్యాంటీన్ లో సాయంత్రం సమోసా తినేందుకు వెళ్లగా.. అక్కడ సమోసాలో రకరకాల వస్తువులు కలిపి తయారు చేశారు. ఇక ఆ సమోసా తింటున్న వారికి.. అందులో ఒక్కక్కటిగా ఆ భయంకరమైన వస్తువులు బయటకి రావడంతో ఒక్కసారిగా వాటిని చూసి షాక్ కు గురయ్యారు. ఇంతకి ఈ భయంకరమైన ఘటన ఎక్కడ జరిగిదంటే..
సాధారణంగా సమోసాలలో.. ఆలు, ఉల్లిగడ్డ, ఇతర మసాలాలు ఉంటాయనే సంగతి అందరికి తెలిసిందే. కానీ, తాజాగా ఓ కంపెనీ క్యాంటీన్ లో తయారు చేసిన సమోసాలో మాత్రం కంగా కండోమ్‌లు, గుట్కా, రాళ్లు ప్రత్యక్షమయ్యాయి. అది చూసి సమోసాలు తినే వారు షాక్‌కు గురయ్యారు.అయితే ఈ భయాంకరమైన ఘటన పుణెలోని ఓ ఆటోమొబైల్ కంపెనీ క్యాంటిన్ లో చోటు చేసుకుంది. కాగా, అక్కడ ఆ కంపెనీకి ప్రతిరోజు వేరే ఒక కంపెనీ నుంచి సమోసాలు సరఫరా అవుతాయి. అయితే ఎప్పటిలాగానే.. ఇటీవలే కూడా సమోసాలు సరఫరా అయ్యాయి. ఇక ఆ సమోసాలను ఆటోమొబైల్ కంపెనీ ఉద్యోగులు తిన్నారు. అలా తింటుండగా.. ఆ సమోసాల నుంచి కండోమ్‌లు, గుట్కా ప్యాకెట్లు, రాళ్లు వారికి దర్శనమిచ్చాయి. ఇక వాటిని చూసిన ఉద్యోగులు ఖంగుతిన్నారు. అనంతరం కొంతమంది అస్వస్థతకు గురివ్వడంతో పాటు వాంతులు కూడా చేసుకున్నారు. దీంతో ఆ ఆటోమొబైల్ కంపెనీ యాజమాన్యం సదరు సమోసా సప్లై కంపెనీపై కేసు నమోదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సమోసా కంపెనీకి వెళ్లి విచారణ జరపగా.. అక్కడ కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కాగా, అక్కడ సమోసా కంపెనీ మాజీ ఉద్యోగులే ఈ కుట్రకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.ఎందుకంటే, వారిని ఉద్యోగాల నుంచి కంపెనీ తొలగించిందన్న కారణంతో.. ఆ కంపెనీకి చెడ్డపేరు తీసుకురావడానికే ఈ పని చేసినట్లు గుర్తించారు. అంతేకాకుండా.. గతంలో సమోసా క్యాటరింగ్ కంపెనీ తయారు చేసిన సమోసాల్లో ఒక బ్యాండేజ్ కనిపించింది. దీంతో ఆ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకున్న క్యాటరింగ్ కంపెనీ ముగ్గురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. దీంతో ఆ కంపెనీపై కోపం పెంచుకున్న ఆ ముగ్గురు ఉద్యోగులు ఆ కంపెనీలో పనిచేసే మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి పక్కాగా ప్లాన్ చేసి మరీ సమోసాలలో కండోమ్‌లు, గుట్కా ప్యాకెట్లు, రాళ్లు నింపి తయారు చేయించారు. దీంతో ముగ్గురు మాజీ ఉద్యోగులతోపాటు వారి చెప్పినట్లు విని సమోసాల్లో నానా చెత్త నింపిన మరో ఇద్దరు ఉద్యోగులు ఫిరోజ్ షేక్, విక్కీ షేక్‌లను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
ఇక ఆ సమోసాలు తిని అస్వస్థతకు గురైన ఆటోమొబైల్ కంపెనీ ఉద్యోగులను యాజమాన్యం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించింది. కాగా, ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉందని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ వార్త వైరల్ కావడంతో.. ఇలా తినే వస్తువుల్లో అలాంటి వస్తువులు పెట్టడం ఏంటి అని సోషల్ మీడియాలో తెగ విమర్శలు గుప్పుమంటున్నాయి. మరి, ఇలా సమోసాల్లో ఇలాంటి వస్తువులు పెట్టి సరఫరా చేసిన ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.