iDreamPost
android-app
ios-app

వీడియో: ఢిల్లీ ఎయిర్ పోర్టులో ప్రయాణికుడికి హార్ట్ ఎటాక్.. CPR చేసిన CISF జవాన్!

Man has Cardiac Arrest In Delhi Airport: ఈ మధ్యకాలంలో గుండెపోటుతో సంభవిస్తున్న మరణాల సంఖ్య బాగా పెరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో గుండెపోటుకు గురైన వారికి సమయానికి సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలు నిలడుతున్నాయి. అలానే తాజాగా ఓ జవాన్ చేసిన పనికి నిండు ప్రాణం నిలబడింది.

ఈ ఇటీవల దేశ వ్యాప్తంగా గుండెపోటు మరణాల సంఖ్య బాగా పెరుగుతుంది. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా, హుషారుగా కనిపించే గుండెపోటుకు గురై…ఉన్నచోటే కుప్పకూలిపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకా చెప్పాలంటే.. నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా వృద్దుల నుంచి పసిపిల్లల వరకు అందరికి ఈ గుండెపోటు అనేది సంభవిస్తుంది. అయితే ఇలా గుండె పోటు వచ్చిన వారికి సరైన సమయంలో కొందరు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడుతున్నారు. అలానే తాజాగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఓ ప్రయాణికులు ఉన్నచోటే కుప్పకూలిపోవడంతో అక్కడే ఉన్నసీఐఎస్ఎఫ్ జవాన్ అతడి ప్రాణాలు రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

బుధవారం ఉదయం అర్షిద్ అయూబ్ అనే అనే ప్రయాణికుడు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. బుధవారం ఢిల్లీ ఎయిర్ పోర్టులోని టెర్నిల్ -2 నుంచి శ్రీనగర్ వెళ్లాల్సి ఉంది.  ఈ క్రమంలోనే బోర్డింగ్ లో ఉన్న అర్షిద్ ఉన్నట్లుండి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) జవాన్లు వెంటనే స్పందించారు. నేలపై కూలిపోయిన అర్షిద్ అయూబ్  వెంటనే సీపీఆర్ చేశారు.

గుండెపోటుకు గురైన అర్షిద్ ఆయుబ్ సీపీఆర్ చేయడంతో పాటు కాళ్లు, చేతులను రుద్దడం చేసి..ప్రాణాలను కాపాడారు. అనంతరం వెంటనే అతడిని సఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఈఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెంటనే స్పందించి.. ఆ యువకుడి ప్రాణాలు కాపాడిన సీఐఎస్ఎఫ్ జవాన్ల పై నెటిజన్లు, ఎయిర్ పోర్టు లోని ప్రయాణికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.