iDreamPost
android-app
ios-app

బెంగళూరును వణికిస్తున్న కలరా .. 45 మంది స్టూడెంట్స్ కు పాజిటివ్

బెంగళూరులో కలరా తీవ్ర కలకలం రేపుతోంది. మెడికల్ కాలేజ్ కు చెందిన హాస్టల్ లోని మెడికల్ స్టూడెంట్స్ కు కలరా సోకడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 45 మంది కలరా బారిన పడ్డారు.

బెంగళూరులో కలరా తీవ్ర కలకలం రేపుతోంది. మెడికల్ కాలేజ్ కు చెందిన హాస్టల్ లోని మెడికల్ స్టూడెంట్స్ కు కలరా సోకడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 45 మంది కలరా బారిన పడ్డారు.

బెంగళూరును వణికిస్తున్న కలరా .. 45 మంది స్టూడెంట్స్ కు పాజిటివ్

మారుతున్న వాతావరణ పరిస్థితులు అనేక వ్యాధులకు కారణమవుతున్నాయి. తినే తిండి, పీల్చే గాలి ఇలా ప్రతీది కలుషితమే అవుతోంది. దీంతో అనేక రోగాలబారిన పడుతున్నారు ప్రజలు. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆకస్మికంగా సంభవించే వ్యాధులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతటి ప్రళయాన్ని సృష్టించిందో వేరే చెప్పక్కర్లేదు. తాజాగా కర్ణాటకాలోని బెంగళూరులో కలరా కలకలం సృష్టిస్తోంది. బెంగళూరు నగరాన్ని కలరా వణికిస్తోంది. ఓ వైద్య కళాశాలలో మెడికల్ స్టూడెంట్స్ కు కలరా సోకగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

బెంగళూరు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ హాస్టల్ లో కలరా కేసులు కలకలం రేపుతున్నాయి. దీంతో హై అలర్ట్ ప్రకటించారు అక్కడి అధికారులు. మొదట్లో ఓ విద్యార్థికి కలరా సోకినట్లు గుర్తించగా.. ఆ తర్వాత మరో విద్యార్థికి సోకినట్లు వెల్లడైంది. మొత్తంగా 45 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా కలరా వ్యాధికి గురైనట్లు వైద్యులు వెల్లడించారు. వారికి చికిత్స కొనసాగుతున్నట్లు తెలిపారు. దీంతో పీజీ హాస్టల్స్ లో హై అలర్ట్ ప్రకటించారు. కలరా వ్యాధికి గురైన మెడికల్ స్టూడెంట్స్ హాస్టల్ ను సిబ్బంది శుద్ధి చేశారు. కాగా గత నెలలోనే ఐదు కలరా కేసులను గుర్తించినట్లు కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా కర్ణాటకాలో తాగునీటి సమస్య తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. అక్కడక్కడ కలుషితమైన నీరు, ఆహారం కారణంగా కలరా కేసులు నమోదవుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.