Dharani
Diamond Necklace-In The Garbage Pile: చెత్త కుప్పలో లక్షల విలువైన వజ్రాలహారం బయటపడింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Diamond Necklace-In The Garbage Pile: చెత్త కుప్పలో లక్షల విలువైన వజ్రాలహారం బయటపడింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Dharani
నేటి కాలంలో మనకు సంబంధించిన ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే అది దొరకడం దాదాపుగా అసాధ్యం. ఇక ప్రయాణాల వేళ వాహనాల్లో ఏవైనా మర్చిపోతే ఆశలు వదిలేసుకోవాల్సిందే. అదే విలువైన ఆభరణాలు, నగదు అయితే.. ఇక మరో ముచ్చటే అవసరం లేదు. అవును మరి పుణ్యానికి దొరికే వస్తువులను మేం ఎందుకు వదులుకోవాలి.. దొంగతనం చేయలేదు.. వేరేవారి అజాగ్రత్త వల్ల మాకు దొరికింది అని వాదించే ప్రబుద్ధులు ఎక్కువయ్యారు. ఎవరో నూటికి ఒక్కరో ఇద్దరో మాత్రం.. పరుల సొమ్ము పాముతో సామానంగా భావించి.. వాటిని తిరిగి ఇస్తారు. అయితే ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. తాజాగా ఓ సంఘటన వెలుగు చూసింది. చెత్త కుప్పలో లక్షల రూపాయలో విలువైన వజ్రాల నెక్లెస్ బటయపడింది. మరి తర్వాత ఏం జరిగింది అంటే..
రోడ్డు మీద రూపాయి కనిపిస్తే.. ఎవరు చూడకపోతే.. జేబులో వేసుకుని చక్కా వెళ్లిపోయే కాలమిది. అలాంటిది బంగారం, వజ్రాల లాంటి విలువైన ఆభరణాలు కనిపిస్తే.. ఇంకేముంది.. వాటిని అందుకుని.. పరగందుకుంటాం. ఒక్క నిమిషం కూడా దాన్ని పోగొట్టుకున్న వారి గురించి ఆలోచించే సమస్యే లేదు. సమాజంలో ఈ కోవకు చెందని వాళ్లే అధికంగా ఉన్నారు. అయితే వీరితో పాటు అక్కడక్కడా కొందరు నిజాయతీపరులు కూడా తారసపడతారు. ఎంత విలువైన వస్తువు దొరికినా సరే.. పోలీసులకు అప్పజెబుతారు. ఈ తరహా ఘటన ఒకటి తాజాగా వెలుగు చేసింది. చెత్త కుప్పలో పారిశుద్ధ్య కార్మికులకు రూ.5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ దొరికింది. దాన్ని తీసుకెళ్లి వారు ఉన్నతాధికారులకు అప్పగించారు. పారిశుద్ధ్య కార్మికుల నిజాయతీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ ఘటన చెన్నైలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉంటున్న దేవరాజ్ అనే వ్యక్తి తన కూతురి పెళ్లి కోసం రూ.5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ చేయించారు. అయితే చెత్తను పారవేసే క్రమంలో మర్చిపోయి.. తన చేతిలో ఉన్న డైమండ్ నెక్లెస్‌ను చెత్త డబ్బాలోకి విసిరివేశారు. ఆ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన కుటుంబసభ్యులు వెంటనే దాని గురించి చెన్నై కార్పొరేషన్‌ను సంప్రదించారు. వెంటనే స్పందించిన కార్పొరేషన్ అధికారులు, కొందరు పారిశుద్ధ్య కార్మికులు డంపింగ్‌యార్డుకు తీసుకువెళ్లి అన్ని చెత్త డబ్బాలను వెతికించారు.
చివరకు ఓ చెత్తకుప్పలో డైమండ్ నెక్లెస్ లభ్యమైంది. చెన్నై కార్పొరేషన్ అధికారులు దానిని యజమానికి ఇవ్వడంతో ఆయన ఆనందం వ్యక్తంచేశారు. తమ సమస్యపై వెంటనే చర్యలు తీసుకొని, విలువైన నెక్లెస్‌ను వెతికి ఇచ్చిన పారిశుద్ధ్య కార్మికులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కొందరు మాత్రం దొరికింది కాబట్టి సంతోషం.. అదే పోయుంటే.. ఇంత నిర్లక్ష్యం పనికి రాదు అంటున్నారు ఈ వార్త తెలిసిన జనాలు.