iDreamPost
android-app
ios-app

బిగ్ బ్రేకింగ్: చంద్రయాన్ 3 విజయంతం.. జయహో భారత్

బిగ్ బ్రేకింగ్: చంద్రయాన్ 3 విజయంతం.. జయహో భారత్

కొన్నేళ్ల కలను ఇస్రో శాస్త్రవేత్తలు నిజం చేసి చూపించారు. చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా భారత్ చరిత్రలో నిలిచిపోయింది. ఈ క్షణం కోసం గత 40 రోజులుగా యావత్ భారతదేశం ఎదురుచూసింది. ఆ క్షణం రానేవచ్చింది. విక్రమ్ ల్యాండర్ సక్సెస్ ఫుల్ గా చంద్రుడిని ముద్దాడింది. ఇప్పటివరకు ఎవరూ చూడని చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారతదేశ ఖ్యాతిని నిలబెట్టారు. ఈ ప్రయోగంతో అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో కొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. సరిగ్గా సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ విజయంవంతంగా చంద్రుడిపై దిగింది. 132 కోట్ల భారతీయులు సగర్వంగా జయహో భారత్ అంటూ నినాదాలు చేస్తున్నారు.

ఈ క్షణాన్ని ప్రత్యక్ష ప్రసారంలో చూసి భారతీయులు అంతా భావోద్వేగానికి గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, నేతలు, సెలబ్రిటీలు అందరూ ఇస్రోకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చరిత్రలో ఇది గుర్తుండిపోయే రోజు అంటూ కీర్తిస్తున్నారు. ఈ విజయంతో అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ దూకుడు మరింత పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాయంత్రం 5.44 గంటలకు మొదలైన ల్యాండింగ్ ప్రక్రియ సరిగ్గా సాయంత్రం 6.04 గంటలకు విజయవంతం అయింది. ఇస్రో శాస్త్రవేత్తల కృషితో ఎలాంటి అంతరాయం, ఇబ్బందులు లేకుండా ల్యాండింగ్ సాగింది. విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కావడంతో శాస్త్రవేత్తలు మాత్రమే కాదు.. బారతీయులు అంతా భావోద్వేగానికి లోనయ్యారు. జయహో భారత్, హేట్సాఫ్ ఇస్రో అంటూ తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా ఈ ప్రపంచానికి తెలియచెబుతున్నారు.