iDreamPost
android-app
ios-app

Big Breaking: చంద్రుడిపై ఆక్సిజన్ గుర్తింపు! కీలక ప్రకటన చేసిన ఇస్రో..

  • Author Soma Sekhar Published - 09:21 PM, Tue - 29 August 23
  • Author Soma Sekhar Published - 09:21 PM, Tue - 29 August 23
Big Breaking: చంద్రుడిపై ఆక్సిజన్ గుర్తింపు! కీలక ప్రకటన చేసిన ఇస్రో..

చంద్రుడిపై పరిశోధనలకు ఇండియా పంపించిన చంద్రయాన్-3 సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఇక జాబిల్లిపై దిగిన రోవర్ తన పనులను తాను చేసుకుంటూ వెళ్తోంది. ఇప్పటికే తాను సేకరించిన విషయాలన్నింటినీ ఇస్రోకు పంపిస్తోంది. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, అక్కడి వాతావరణం ఎలా ఉందన్న విషయాలకు చెందిన సమాచారాన్ని ఇస్రోకు చేరవేసింది. తాజాగా మరో కీలక సమాచారాన్ని చేరవేసింది. చంద్రుడిపై ఆక్సిజన్ గుర్తించినట్లు ఇస్రో ప్రకటించింది.

చంద్రుడిపై ఇస్రో కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే జాబిల్లిపై ల్యాండ్ అయిన రోవర్ అక్కడి సమాచారాన్ని మెుత్తం ఇస్రోకు చేరవేస్తోంది. అందులో భాగంగానే ప్రజ్ఞాన్‌ రోవర్‌.. చంద్రుడిపై ఆక్సిజన్ ఉన్నట్లు గుర్తించింది. ఆక్సిజన్ తో పాటుగా పలు ఖనిజాలు కూడా ఉన్న ఆనవాళ్లను గుర్తించింది. ఆక్సిజన్ తో పాటు.. మాంగనీస్, అల్యూమినియం, సల్పర్, సిలికాన్ లాంటి ఖనిజాల ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించింది. కాగా.. ప్రస్తుతం ప్రజ్ఞాన్‌ రోవర్‌ హైడ్రోజన్ ఆనవాళ్లను గుర్తించే పనిలో పడిందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రకటన ఎంతో కీలకమైనదిగా ఇస్రో అధికారులు తెలుపుతున్నారు. ఇక ఇందుకు సంబంధించిన ట్విట్ ను ఇస్రో పోస్ట్ చేసింది.