iDreamPost
android-app
ios-app

ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్లు కొనేవారికి గుడ్ న్యూస్.. కేంద్రం కొత్త రూల్‌తో భారీ ప్రయోజనం!

  • Published Jun 24, 2024 | 9:10 PM Updated Updated Jun 24, 2024 | 9:10 PM

Good News To AC, Refrigerator Buyers: ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్లు కొనేవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వినియోగదారుల కోసం కేంద్రం కొత్త రూల్‌ తీసుకురాబోతుంది. ఇప్పటికే ఏసీ, ఫ్రిడ్జ్ లు వంటివి తయారుచేసే ఎలక్ట్రానిక్ కంపెనీలపై చర్చలు జరిపింది. చర్చలు సఫలమైతే ఏసీలు, ఫ్రిడ్జ్ లు కొనేవారికి భారీ ప్రయోజనం చేకూరనుంది. అదేంటంటే?

Good News To AC, Refrigerator Buyers: ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్లు కొనేవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వినియోగదారుల కోసం కేంద్రం కొత్త రూల్‌ తీసుకురాబోతుంది. ఇప్పటికే ఏసీ, ఫ్రిడ్జ్ లు వంటివి తయారుచేసే ఎలక్ట్రానిక్ కంపెనీలపై చర్చలు జరిపింది. చర్చలు సఫలమైతే ఏసీలు, ఫ్రిడ్జ్ లు కొనేవారికి భారీ ప్రయోజనం చేకూరనుంది. అదేంటంటే?

ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్లు కొనేవారికి గుడ్ న్యూస్.. కేంద్రం కొత్త రూల్‌తో భారీ ప్రయోజనం!

ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, స్మార్ట్ టీవీ, ఎయిర్ కండిషనర్ ఇలా పలు ఎలక్ట్రానిక్ వస్తువులను కొంటూ ఉంటారు కస్టమర్లు. నిత్యం ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేస్తుంటారు. ఎప్పుడూ కస్టమర్లతో ఎలక్ట్రానిక్ స్టోర్స్ రద్దీగా ఉంటాయి. వేసవికాలం వచ్చిందంటే ఫ్రిడ్జ్, ఎయిర్ కండిషనర్లకి డిమాండ్ పెరిగిపోతుంది. ఇదిలా ఉంటే ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో ప్రభుత్వం కొత్త రూల్స్ ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఎలక్ట్రానిక్ పరికరాలపై వారంటీ విషయంలో ఈ కొత్త రూల్స్ రానున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసినప్పుడు వారంటీ ఇస్తారు. అయితే ఈ వారంటీ అనేది వస్తువు కొనుగోలు చేసినప్పటి నుంచి వర్తిస్తుంది.

స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ వంటి వాటికి అంటే వారంటీ తేదీ అనేది కొన్నప్పుడు వర్తించినా అర్ధం ఉంది. ఎందుకంటే వాటిని అదే రోజు నుంచి కస్టమర్స్ వాడుకుంటారు కాబట్టి. కానీ ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ లు వంటివి కొనుగోలు చేసిన రోజే హోమ్ డెలివరీ అయినప్పటికీ కంపెనీ టెక్నీషియన్ వచ్చి ఇన్ స్టాల్ చేస్తేనే గానీ వాటిని వాడలేరు. అలాంటప్పుడు టెక్నీషియన్ వచ్చేవరకూ ఇంట్లో ఖాళీగా ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులపై వారంటీ డేట్ కొన్న రోజు నుంచే ఎందుకు అన్న ప్రశ్న చాలా మందికి వచ్చింది. దీంతో వినియోగదారులు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులు పెరుగుతుండడంతో వారంటీ తేదీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను కంపెనీల ముందుంచుంది. వారంటీ తేదీని మార్చాలని.. కొనుగోలు చేసిన రోజున కాకుండా ఇన్ స్టాల్ చేసిన రోజు నుంచే వారంటీ వర్తింపజేయాలని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది.

15 రోజుల్లోగా  కంపెనీలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. ఈ క్రమంలో వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కంపెనీలతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఎల్జీ, పానాసోనిక్, రిలయన్స్ రిటైల్, హైయర్, క్రోమా వంటి దిగ్గజ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వారంటీ వ్యవధి అంశంపై చర్చించింది. ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసిన తేదీన కాకుండా ఇంట్లో ఇన్స్టాల్ చేసిన రోజు నుంచి వారంటీ తేదీని వర్తింపజేయాలని కంపెనీలకు సూచించించి. వినియోగదారుల రక్షణ చట్టంలోని సెక్షన్ 2(9) ప్రకారం ఉత్పత్తులు, వస్తువులు, వాటి పరిమాణం, స్వచ్ఛత, సేవల నాణ్యత, ధర వంటివి వినియోగదారులకు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది.