iDreamPost
android-app
ios-app

ప్రాపర్టీ ఓనర్స్‌కి బిగ్ రిలీఫ్.. LTCG ఇండెక్సేషన్ అమలు వాయిదా!

  • Published Aug 06, 2024 | 8:28 PM Updated Updated Aug 06, 2024 | 8:28 PM

Central Government Postpones New Rules On Indexation, LTCG To Next Financial Year Says Reports: 2024-25 వార్షిక బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంలో భాగంగా కొన్ని కొత్త రూల్స్ వచ్చాయి. దీని వల్ల కొన్ని వర్గాలపై పన్ను భారం అధికంగా పడనుంది. అయితే ఇప్పుడు ఆ పన్ను భారాన్ని తగ్గించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Central Government Postpones New Rules On Indexation, LTCG To Next Financial Year Says Reports: 2024-25 వార్షిక బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంలో భాగంగా కొన్ని కొత్త రూల్స్ వచ్చాయి. దీని వల్ల కొన్ని వర్గాలపై పన్ను భారం అధికంగా పడనుంది. అయితే ఇప్పుడు ఆ పన్ను భారాన్ని తగ్గించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రాపర్టీ ఓనర్స్‌కి బిగ్ రిలీఫ్.. LTCG ఇండెక్సేషన్ అమలు వాయిదా!

2024-25 వార్షిక బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం అనేక సంచలన నిర్ణయాలను తీసుకున్న విషయం తెలిసిందే. వీటిలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ)పై ఇండెక్సేషన్ బెనిఫిట్ ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ బెనిఫిట్ ఉన్నప్పుడు భూమి, స్థలం, బంగారం ఇలా ఏదైనా గానీ ప్రాపర్టీ విలువలోంచి ద్రవ్యోల్బణం విలువని తీసేయగా వచ్చిన విలువకి 20 శాతం ట్యాక్స్ ఉండేది. అయితే ఇప్పుడు ఆ బెనిఫిట్ ని తీసేసి ప్రాపర్టీ ప్రస్తుతం ఎంత విలువ ఉంటే అంత మొత్తానికి ఎవరైనా సరే 12.5 శాతం పన్ను కట్టాల్సిందే అన్న రూల్ ని తీసుకొచ్చింది. దీంతో పలు వర్గాల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. తమకు వచ్చే లాభాల కన్నా నష్టపోయే ప్రమాదమే ఎక్కువగా ఉందని పలువురు కేంద్రానికి సూచించడంతో ప్రభుత్వం ఆలోచనలో పడినట్లు బిజినెస్ స్టాండర్డ్ నివేదిక పేర్కొంది.

ఈ క్రమంలో ప్రాపర్టీ యజమానులకు ట్యాక్స్ రిలీఫ్ కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను చెల్లించాలన్న నిబంధనను సవరించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. ఈ కొత్త నిబంధనలను సవరించి.. వీటి అమలును వాయిదా వేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొత్త పన్ను విధానాన్ని అమలు చేసే తేదీని పొడిగించాలని, ప్రస్తుతానికైతే వాయిదా వేయాలని కేంద్రం భావిస్తుంది. 2025-26వ ఆర్థిక ఏడాదిలో ఈ కొత్త నిబంధనలను అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.

అంతేకాదు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పై పన్ను తగ్గించగల అన్ని అసెట్స్ కి సంబంధించి ఇండెక్సేషన్ బెనిఫిట్ ని అనుమతించే విషయంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జూలై 23వ తేదీ నుంచి ఇండెక్సేషన్ బెనిఫిట్ ని తొలగిస్తూ.. కొత్త లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నిబంధనలు అమలులోకి తీసుకొచ్చింది కేంద్రం. ఇండెక్సేషన్ బెనిఫిట్ ని తీసేసి దీర్ఘకాలికంగా హోల్డ్ చేసిన ప్రాపర్టీలు, ఆస్తులు ఏమైనా ఉంటే కనుక వాటి ధరలో 12.5 శాతం పన్ను చెల్లించాలని రూల్ ఉండేది. దీంతో ఈ ఆస్తులను విక్రయించాలనుకునే వారిపై పన్ను భారం పెరుగుతుంది. అయితే ఇప్పుడు కేంద్రం ఈ పన్ను భారం నుంచి ఆస్తుల యజమానులకు రిలీఫ్ ఇచ్చే విధంగా కొత్త పన్ను విధానంలో మార్పులు తీసుకురావాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే కనుక ఎప్పుడో ప్రాపర్టీ, బంగారం వంటివి కొని ఇన్నేళ్ల పాటు హోల్డ్ చేసిన వారికి భారీ శుభవార్త అని చెప్పవచ్చు.