Arjun Suravaram
U-Win Portal: దేశ వ్యాప్తంగా వ్యాధి నిరోధక టీకాలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసింది. ఈక్రమంలోనే వ్యాధి నిరోధక టీకాల పంపిణీని పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేయడానికి కొత్త పోర్టల్ ను తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది.
U-Win Portal: దేశ వ్యాప్తంగా వ్యాధి నిరోధక టీకాలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసింది. ఈక్రమంలోనే వ్యాధి నిరోధక టీకాల పంపిణీని పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేయడానికి కొత్త పోర్టల్ ను తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది.
Arjun Suravaram
ప్రజల ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా బాలింతలు, పిసిపిల్లల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. అందుకే గర్భీణి మహిళలకు, పిల్లలకు టీకాలు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసింది. కొన్నేళ్ల నుంచి ఈ టీకాల కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో, ఇతర ప్రత్యేక ఆరోగ్య కేంద్రాల్లో ఈ టీకాలను పంపిణీ చేస్తుండే వారు. వ్యాధి నిరోధక టీకాల పంపిణీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వీటి పంపిణీనికి ఓ కొత్త యాప్ ను తీసుకురానుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
దేశ వ్యాప్తంగా వ్యాధి నిరోధక టీకాలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసింది. ఈక్రమంలోనే వ్యాధి నిరోధక టీకాల పంపిణీని పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేయడానికి కొత్త పోర్టల్ ను తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. యూ–విన్ అనే కొత్త పోర్టల్ యాప్ను కేంద్రం ఆగస్టు నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంది. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా 2024 జులై 9 వరకు 5.33 కోట్ల మంది గ్రహీతల వివరాలను యు–విన్ పోర్టల్ లో కేంద్ర ప్రభుత్వం నమోదు చేయనుంది.
ఇక ఈ పోర్టల్ కీలక అంశాలను, వివరాలను నమోదు చేస్తారు. ప్రతి గర్భిణి, అయిదేళ్ల లోపు పిల్లలకు వేసే ప్రతి టీకా వివరాలు ఈ పోర్టల్ ద్వారా డిజిటలైజ్ చేస్తారు. దీంతో టీకా వేసుకునే షెడ్యూల్ ప్రకారం ఆయా కుటుంబ సభ్యులకు ఈ పోర్టల్ ద్వారా ముందుగానే సమాచారం వెళ్తోంది. కొన్ని సందర్భాల్లో కొందరు బాధితులు వ్యాక్సిన్ వేసుకునే సమయాన్ని మర్చిపోతుంటారు. అలాంటి వారు తమ వ్యాక్సిన్ సమయాన్ని మర్చిపోయినా సరే పోర్టల్ ద్వారా అందించిన సమాచారంతో సరైన టైమ్ లో తీసుకోవచ్చు.
ఇక ఈడిజిటలైజేషన్ ద్వారా దేశం ఎక్కడైనా సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ వేయవచ్చు. ఇక గర్భిణీలు,పిల్లలు టీకా తీసుకున్న తర్వాత సర్టిఫికేట్ ను తీసుకోవచ్చు. అది కూడా ఈ పోర్టల్ ను ఉపయోగించి సర్టిఫికెట్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే విధంగా టీకా వేయించుకునే టైమ్ ను కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు. ఈ పోర్టల్ క్యూఆర్ కోడ్ ఆధారంగా పనిచేస్తుంది. దీంతో ఈ పోర్టుల ద్వారా ఈ-టీకా ధ్రువీకరణ పత్రాన్ని దేశ పౌరులు ఎవరైనా పొందవచ్చు. గతంలో కొవిడ్ టైమ్ లో వ్యాక్సినేషన్ పోర్టల్ కో–విన్ మాదిరిగానే పనిచేసే ఈ పోర్టల్ కూడా పని చేయనుంది.
పశ్చిమబెంగాల్ మినహా మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ఈ పోర్టల్ ను అమలు చేస్తున్నది. అండ్రాయిడ్ ఫోన్ డౌన్ లో యూ విన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. దీని ద్వారా కోరుకున్న టీకా కేంద్రాల్లో టీకాలు పొందడానికి స్వీయ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మొత్తంగా వ్యాధి నిరోధక టీకాల్లో కొత్త పోర్టల్ ప్రజలకు అందుబాటులోకి రానుంది.