P Venkatesh
వాహనం నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ లపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టింది.
వాహనం నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ లపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టింది.
P Venkatesh
వాహనం ఏదైనా సరే నడపాలంటే ముఖ్యంగా ఉండాల్సింది డ్రైవింగ్ లైసెన్స్. డ్రైవింగ్ వృత్తి ఎంచుకున్న వారికైనా.. సొంత వాహనాలు ఉన్నవారికైనా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. లైసెన్స్ లేకుండా వాహనాలను నడిపితే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధిస్తుంటారు. ఆర్టీవో కార్యాలయాలు డ్రైవింగ్ లైసెన్స్ లను జారీ చేస్తుంటాయి. అయితే డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లాలి. టెస్టుకు హాజరవ్వాలి. ఒక వేళ టెస్టులో ఫెయిలైతే మళ్లీ స్లాట్ బుక్ చేసుకుని టెస్టుకు వెళ్లాల్సిందే. ఈ ప్రక్రియ అంతా ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్నది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ కష్టాలు తీరనున్నాయి. కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ లకు సంబంధించి కొత్త రూల్ ను తీసుకొచ్చింది. ఇకపై మరింత ఈజీగా లైసెన్స్ పొందొచ్చు.
వాహనదారులకు గుడ్ న్యూస్ అందించింది కేంద్ర ప్రభుత్వం. డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ఆర్టీఓ ఆఫీసులో టెస్ట్ కి హాజరవ్వాల్సిన అవసరం లేదంటూ ప్రభుత్వం వెల్లడించింది. ఆర్టీఓ ఆఫీసుకు బదులు ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల వద్ద టెస్ట్ కు హాజరయ్యి సర్టిఫికెట్ పొందొచ్చని తెలిపింది. జూన్ 1, 2024నుండి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఈ రూల్స్ అమల్లోకి వచ్చాక డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. కేంద్ర రోడ్డు రవాణా సంస్థ జారీ చేసిన కొత్త రూల్స్ ప్రకారం ఇకపై ప్రైవేట్ డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్‌లే డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి సర్టిఫికేట్లు జారీ చేస్తాయి. డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్‌లు డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేశాక డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి సర్టిఫికేట్ జారీ చేస్తాయి. దాని ఆధారంగా లైసెన్స్ కోసం అప్లై చేసుకుంటే ఈజీగా పొందవచ్చు.
కాగా డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలకు కేంద్రం కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. ఫోరా్ వీల్ డ్రైవ్ టెస్ట్ సంస్థకు మూడెకరాల స్థలం ఉండాలి. టెస్ట్ నిర్వహించేందుకు అన్ని సౌకర్యాలు కలిగి ఉండాలి. ట్రైనర్లు హైస్కూల్ విద్య పూర్తి చేసుకుని డ్రైవింగ్‌లో ఐదేళ్లు అనుభవం కలిగి ఉండాలి. బయోమెట్రిక్ టెక్నాలజీపై అవగాహన కలిగి ఉండాలి. డ్రైవింగ్ శిక్షణ లైట్ వెహికల్ అయితే నాలుగు వారాలుగా నిర్ణయించింది. ఇందులో 21 గంటలు ప్రాక్టికల్స్, 8 గంటలు థియరీ ఉండేట్టు చూసుకోవాలి. అదే హెవీ వెహికల్ డ్రైవింగ్ అయితే ఆరు వారాల శిక్షణ ఉంటుంది. ఇందులో థియరీ 8 గంటలు, ప్రాక్టికల్స్ 31 గంటలుండాలి. ఈ రూల్స్ ప్రకారం శిక్షణ పూర్తైన తర్వాత లైసెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలని కేంద్రం తెలిపింది.