iDreamPost

విద్యార్థుల కోసం ఆధార్ తరహాలో అపార్ కార్డ్.. దీని ఉపయోగం ఏంటంటే?

కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం విశిష్టమైన అంకెలతో కూడిన అపార్ కార్డులను ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆధార్ తరహాలోనే ఈ అపార్ కార్డులు ఉండనున్నాయి. ఇంతకీ ఈ అపార్ కార్డు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం విశిష్టమైన అంకెలతో కూడిన అపార్ కార్డులను ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆధార్ తరహాలోనే ఈ అపార్ కార్డులు ఉండనున్నాయి. ఇంతకీ ఈ అపార్ కార్డు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

విద్యార్థుల కోసం ఆధార్ తరహాలో అపార్ కార్డ్.. దీని ఉపయోగం ఏంటంటే?

కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పౌరులకు ఇచ్చే ఆధార్ కార్డు తరహాలోనే స్టూడెంట్స్ కు కూడా అపార్ కార్డ్ లు ఇచ్చేందుకు సిద్ధమవుతోది. ఇది విద్యా మంత్రిత్వ శాఖ మరియు భారత ప్రభుత్వంచే సృష్టించబడిన ప్రత్యేక గుర్తింపు కార్డు. భారతదేశంలోని ప్రతి పాఠశాల విద్యార్థికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ప్రభుత్వ, ప్రైవేటు, విద్యాసంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు ఇకపై ఆధార్‌ తరహాలో అపార్‌ గుర్తింపు కార్డు అందుబాటులోకి రానుంది. మరి అపార్ కార్డ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అపార్‌కార్డ్ అంటే ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ అని పిలుస్తారు. కేంద్ర ప్రభుత్వం ‘వన్‌ నేషన్‌- వన్‌ ఐడీ’ పేరుతో విద్యార్థులకు అపార్ కార్డులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. విద్యార్థులకు అపార్ కార్డులు ఇచ్చేందుకు తల్లిదండ్రుల అనుమతి తీసుకుని విద్యార్థుల వివరాలు సేకరించాలని కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆపార్ కార్డ్ బాధ్య‌త‌ను నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరంకు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. విద్యార్థికి సంబంధించిన సమగ్ర సమాచారం ఈ అపార్ కార్డుల్లో నిక్షిప్తంకానుంది. ఇప్పుడు అన్ని పనులకు ఆధార్ ను ఎలా అయితే ఉపయోగిస్తున్నామో.. అదే విధంగా అపార్ కార్డు కూడా విద్యార్థులకు కెరీర్ పరంగా ఉపయోగపడనున్నది.

అపార్ కార్డ్ ఉపయోగాలు:

విద్యార్థులకు ఈ కార్డు డిజిటల్‌ రికార్డు లాంటిది. ఇది వారి విద్యావిషయక విజయాలు, డిగ్రీలు, స్కాలర్‌షిప్‌లు మరియు ఇతర క్రెడిట్‌లను ట్రాక్ చేస్తుంది. సరళంగా చెప్పాలంటే, ఇది డిజిటల్ ఫార్మాట్‌లో విద్యార్థి పాఠశాల ప్రయాణం గురించిన ముఖ్యమైన సమాచారాన్ని కలిగి ఉండే డిజిటల్ కార్డ్. విద్యార్థి పాఠశాలలో చేరినప్పటి నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు.. అన్ని వివ‌రాలు అపార్ కార్డులో ఉండనున్నాయి. అంతేగాక ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు బదిలీ అయ్యే విద్యార్థులకు, దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ప్రవేశం పొందడం మరింత సరళంగా ఉంటుంది. ఈ కొత్త కార్డును ఆధార్ సంఖ్యతోపాటు ‘అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ)’ అనే ఎడ్యులాకర్‌కు అనుసంధానించ‌డం జ‌రుగుతుంది. ఈ అపార్‌ నెంబర్‌నే విద్యార్థి జీవితకాల ఐడీగా ప‌రిగ‌ణించ‌నున్నారు. మరి విద్యార్థుల కోసం తీసుకురాబోతున్న అపార్ కార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి