Banking Regulation: సామాన్యులకు శుభవార్త.. ఇకపై బ్యాంకు ఖాతాలకు నలుగురు నామినీలు!

సామాన్యులకు శుభవార్త.. ఇకపై బ్యాంకు ఖాతాలకు నలుగురు నామినీలు!

Banking Regulation: ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే ఎన్డీయే ప్రభుత్వం కీలక బిల్లులను లోక్ సభలో ప్రవేశ పెడుతుంది. ఈ నేపథ్యంలో సామాన్యులకు ఓ గుడ్ న్యూస్ అందిచనున్నట్లు తెలుస్తోంది.

Banking Regulation: ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే ఎన్డీయే ప్రభుత్వం కీలక బిల్లులను లోక్ సభలో ప్రవేశ పెడుతుంది. ఈ నేపథ్యంలో సామాన్యులకు ఓ గుడ్ న్యూస్ అందిచనున్నట్లు తెలుస్తోంది.

నేటికాలంలో దాదాపు అందరికీ  బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. వీటి ద్వారా లావాదేవీలను నిర్వహిస్తుంటారు. అలానే వివిధ రకాల స్కీమ్ లో చేరేందుకు ఈ బ్యాంక్ అకౌంట్ అనే తప్పనిసరి. అయితే బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసే క్రమంలో నామినీగా ఒకరిని పెడతారు. ఈ క్రమంలోనే బ్యాంకుల్లో ఖాతాల్లో ఉన్నవారికి ఓ గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పొచ్చు. త్వరలో బ్యాంకు అకౌంట్ కి నలుగురిని నామినీగా పెట్టుకోవచ్చు. మరి..పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే ఎన్డీయే ప్రభుత్వం కీలక బిల్లులను లోక్ సభలో ప్రవేశ పెడుతుంది. ఈ క్రమంలోనే కొన్ని బిల్లులకు ఆమోదం లభిస్తుండగా, మరికొన్ని పెండింగ్ లో ఉన్నాయి. మరికొన్నిటికి ఆమోదం పడే అవకాశం ఉంది. అలానే శుక్రవారం  లోక్ సభలో ప్రభుత్వం బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు- 2024ను ప్రవేశపెట్టింది. బ్యాంక్ అకౌంట్లకు ఉండే నామినీల సంఖ్యను పెంచేలా మార్పులు చేస్తూ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ఒకరినే నామినీనే ఎంచుకునే అవకాశం ఉన్న సంగతి తెలిసింది.

ఈ నేపథ్యంలో ఆ సంఖ్యను నాలుగుకు పెంచుతూ బ్యాంకింగ్ చట్టాల్లో సవరణలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించిస్తే.. బ్యాంకు కస్టమర్లు తమ అకౌంట్లకు నలుగురు నామినీలను ఎంచుకునే ఛాన్స్ లభిస్తుంది. ఈ నిర్ణయం ద్వారా బ్యాంకు అకౌంట్ల క్లెయిమ్ చేయని డిపాజిట్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అదే విధంగా డైరెక్టర్ షిప్ హోదాకు ఉండాల్సిన కనీస వాటా పరిమింతిని పెంచేలా చట్ట సవరణ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల నుంచి రూ. 2 కోట్లకు పెంచనున్నట్లు సమాచారం. ఆరు దశాబ్దాలుగా రూ.5 లక్షల పరిమితి కొనసాగుతూనే ఉండగా..  ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మార్పులు చేయలేదు. ఈ క్రమంలో బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు- 2024ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

 బ్యాంక్ అకౌంట్లలో ఏటా క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్య పెరుగుతోంది. దీంతో వాటిని ఖాతాదారుల కుటుంబ సభ్యులకు చేరవేయడంలో సమస్య తలెత్తుతోంది.  ఇప్పటి వరకు ప్రత్యేక ఖాతాలకు వాటిని బదిలీ చేస్తూ నామినీలకు చేరవసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ క్లైమ్ చేయని డిపాజిట్ల సంఖ్య సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే బ్యాంకింగ్ చట్టాన్ని సవరిస్తూ.. నామినీల సంఖ్యను పెంచుతోంది. దీని ద్వారా చట్టబద్ధమైన వారసుల సంఖ్య పెరిగి అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను వేగంగా వారికి అందించే వీలు కలుగుతుందని కేంద్రం భావిస్తోంది. మొత్తంగా కేంద్ర ప్రవేశ పెట్టిన ఈబిల్లుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments