Dharani
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అవుతోంది కేంద్ర ప్రభుత్వం. 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు..
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అవుతోంది కేంద్ర ప్రభుత్వం. 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు..
Dharani
మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు రానున్నాయి. వచ్చే ఎలక్షన్స్‌లో 400 సీట్లు గెలవాలని కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఓటర్లను ఆకట్టుకోవడం కోసం రకరకాల పథకాలు ప్రవేశపెట్టడం, ఉన్న వాటి పరిమితిని పెంచడం చేస్తోంది. దీనిలో భాగంగా గత ఏడాది రాఖీ పండుగ సందర్భంగా గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు మరో శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రజలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో దీనిపై ప్రకటన చేయనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆయుష్మాన్ భారత్ కవరేజీని రెట్టింపు చేసేందుకు కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయుష్మాన్ భారత్ కార్డుపై కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని ఇంగ్లీష్ మీడియా వార్తలు ప్రచురిస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం.. ఆయుష్మాన్ భారత్ కార్డుపై అర్హులైన ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తోన్న సంగతి తెలిసిందే.
అయితే క్యాన్సర్ చికిత్స, అవయవ మార్పిడి వంటి వాటికి చాలా ఖర్చు అవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. ఆయుష్మాన్ భారత్ కవరేజీని పెంచేందుకు కేంద్రం రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌లో దీనిపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం 2018లో ఈ పథకాన్ని ప్రారంభించింది. నాటి నుంచి నేటి వరకు సుమారు 6.2 కోట్ల మంది ప్రజలు ఆయుష్మాన్ భారత్ కార్డును వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం రూ. 79,157 కోట్లు ఖర్చు చేసింది. ఆయుష్మాన్ భారత్ లేకుండా వైద్యం చేయించుకుని ఉంటే ప్రజలకు రెట్టింపు ఖర్చు అయ్యదని అధికారులు తెలిపారు. గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023-24లో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కోసం కేంద్రం రూ. 7,200 కోట్లు కేటాయించింది.
ఈ ఆర్థిక ఏడాది 2024-25 కోసం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో దానిని రెండింతలు చేసి రూ. 15000 కోట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జనవరి 12, 2024 నాటికి దేశవ్యాప్తంగా 30 కోట్లకుపైగా ఆయుష్మాన్ బారత్ కార్డులను జారీ చేసింది కేంద్రం. మరో మూడేళ్లలో ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం లబ్ధిదారులు సంఖ్యను 100 కోట్లు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈమేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రణాళికలు రచిస్తోంది. ప్రచారం జరుగుతున్నట్లుగానే ఆయుష్మాన్ పథకం కవరేజీని పెంచితే సామాన్యులకు ఎంతో ఊరట లభిస్తుంది అంటున్నారు.