iDreamPost
android-app
ios-app

ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఏకంగా 25 లక్షలకు!

  • Published Jun 01, 2024 | 3:11 PM Updated Updated Jun 01, 2024 | 3:11 PM

Good News Employees: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరే శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ 3,4 శాతం చొప్పున పెంచుకుంటూ వచ్చిన కేంద్రం.. మార్చి నెలలో 50 శాతానికి పెంచింది. డీఏ 50 శాతానికి చేరితే ఇతర ప్రయోజనాలు కూడా ఉద్యోగులకు అందనున్నాయి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త తెలిపింది.

Good News Employees: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరే శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ 3,4 శాతం చొప్పున పెంచుకుంటూ వచ్చిన కేంద్రం.. మార్చి నెలలో 50 శాతానికి పెంచింది. డీఏ 50 శాతానికి చేరితే ఇతర ప్రయోజనాలు కూడా ఉద్యోగులకు అందనున్నాయి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త తెలిపింది.

ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఏకంగా 25 లక్షలకు!

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరే శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ వరుసగా పెంచుకుంటూ వచ్చింది. 3,4 శాతం చొప్పున పెంచుకుంటూ వచ్చిన కేంద్రం.. మార్చి నెలలో 50 శాతానికి పెంచింది. అయితే డీఏ 50 శాతానికి చేరడంతో కొత్త నిబంధనలు అమలవుతుంటాయి. ఈ నిబంధనల్లో డీఏని బేసిక్ పేలో కలిపేసి దాన్ని మళ్ళీ సున్నా నుంచి అమలు చేయడం ఒకటి. ఇక డీఏ 50 శాతానికి చేరితే ఇతర ప్రయోజనాలు కూడా ఉద్యోగులకు అందనున్నాయి. వీటిలో ముఖ్యంగా హెచ్ఆర్ఏ సహా ఇతర అలవెన్సులు పెరుగుతాయి.

అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త తెలిపింది. ఉద్యోగుల రిటైర్మెంట్ గ్రాట్యుటీని భారీగా పెంచుతున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. రిటైర్మెంట్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీ 25 శాతం పెంచింది. దీంతో గతంలో 20 లక్షలు ఉండగా.. ప్రస్తుతం 25 లక్షలకు పెంచింది. ఇది 2024 జనవరి 1 నుంచే అమలులోకి వచ్చిందని.. ఈ మేరకు మే 30న అధికారిక ప్రకటన వెలువరించింది. మార్చి నెలలో కేంద్రం డీఏని 4 శాతం పెంచి 50 శాతానికి చేర్చింది. ఈ విధానం జనవరి నుంచే అమలులో ఉంది. అయితే కేంద్రం మార్చి నెలలో ప్రకటించింది. ఏడాదిలో రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం డీఏని సవరించాల్సి ఉంటుంది. ప్రతి ఏటా జనవరి, జూలై నెలలో సవరించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం మార్చి, సెప్టెంబర్ నెలల్లో ప్రకటిస్తుంది.

ఉద్యోగులు ఏదైనా ఒక సంస్థలో ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ రోజులు పని చేస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. వాళ్ళు గ్రాట్యుటీకి అర్హులుగా పరిగణించబడతారు. నిజానికి ఉద్యోగి కంపెనీలో చేరిన ప్రతిసారి సీటీసీలో కొంత భాగం గ్రాట్యుటీలో జమ అవుతుంది. కాబట్టి ఉద్యోగులందరూ గ్రాట్యుటీ పొందేందుకు అర్హులే. ఇక ప్రైవేట్ కంపెనీలో చేసే ఉద్యోగులకు కూడా గ్రాట్యుటీ అనేది వర్తిస్తుంది. ఇది ఉద్యోగుల బేసిక్ వేతనంలో 4.81 శాతంగా ఉంటుంది. ఉద్యోగి సీటీసీ 5 లక్షలు అనుకుంటే.. నెలకు 2 వేల చొప్పున ఏడాదికి రూ. 24,050 గ్రాట్యుటీ అందుతుంది. ఉద్యోగి జీతం, డీఏ ఆధారంగా ఈ గ్రాట్యుటీని లెక్కిస్తారు. ఉద్యోగి సర్వీస్ కాలం, రిటైర్మెంట్ ముందు నెల వరకూ అందుకున్న జీతం ఆధారంగా గ్రాట్యుటీ ఉంటుంది. నెలకు 26 రోజులుగా లెక్కించి ఈ గ్రాట్యుటీని చెల్లిస్తారు.