iDreamPost
android-app
ios-app

గుడ్ న్యూస్: దేశంలో 12 కొత్త ఎయిర్ పోర్టులు! తెలుగు రాష్ట్రాలకి?

  • Published Jul 31, 2024 | 3:49 PM Updated Updated Jul 31, 2024 | 3:49 PM

తాజాగా కేంద్ర ప్రభుత్వం విమాన ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే కొత్తగా దేశంలో అదనంగా మరో 12 ఎయిర్ పోర్టులను నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. ఇంతకీ ఎక్కడంటే..?

తాజాగా కేంద్ర ప్రభుత్వం విమాన ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే కొత్తగా దేశంలో అదనంగా మరో 12 ఎయిర్ పోర్టులను నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. ఇంతకీ ఎక్కడంటే..?

  • Published Jul 31, 2024 | 3:49 PMUpdated Jul 31, 2024 | 3:49 PM
గుడ్ న్యూస్:  దేశంలో 12 కొత్త ఎయిర్ పోర్టులు! తెలుగు రాష్ట్రాలకి?

ప్రస్తుత కాలంలో విమాన సేవలను వినియోగించుకునే వారి సంఖ్య క్రమేపి పెరిగిపోతుంది. ఎందుకంటే.. తక్కవ సమయంలో త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలంటే అందుకు ఈజీ మార్గం విమాన ప్రయాణం. అందుకే ఈ ఫ్లైట్ జర్నీ చేసేందుకు చాలామంది ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే దేశంలోని చాలా నగరాల్లో అంతర్జాతీయ విమానాశ్రాయాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో సామాన్యులు, సెలబ్రిటీస్, వ్యాపారస్తులు ఇలా వివిధ వర్గాల వారు విమాన ప్రయాణాన్నికొనసాగిస్తున్నారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం విమాన ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకి అదేమిటంటే..

తాజాగా దేశంలోని  విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా దేశంలో అదనంగా మరో 12 ఎయిర్ పోర్టులను నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. అయితే దేశంలో ఈ  కొత్త ఎయిర్ పోర్టులు ఏర్పాటుపై  సోమవారం (జూలై 29, 2024న) జరిగిన లోక్ సభ సమావేశంలో కేంద్రం పౌర విమానయాన శాఖ మంత్రి మురళీధర్ మోహల్ స్వయంగా  లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు . అంతేాకాకుండా.. UDAN పథకంలో భాగంగా  కొనసాగిస్తూ.. ఎప్పటికప్పుడు బిడ్డింగ్ ప్రక్రియను జరుపుతూ కొత్త ఎయిర్ పోర్టులు రూట్లను తీసుకొస్తున్నట్లు తెలిపారు. అలాగే  ఇప్పుడున్న ఎయిర్ పోర్టులను కూడా ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ఎయిర్ పోర్టులను ఈ 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రారంభిస్తామని కేంద్రం తెలిపింది. కాగా, ఈ ఎయిర్ పోర్టులు కానీ అందుబాటులోకి వస్తే ప్రాంతీయ కనెక్టివిటీ మరింత ఎక్కువగా పెరుగుతుందని కేంద్రం వివరించింది.

అయితే ప్రస్తుతం దేశంలో  మొత్తం 85 ఎయిర్ పోర్టులు ఉన్నాయి. కాగా, ఆ విమానాలు అనేవి 579 రూట్లలో నడుస్తున్నాయి. ఇక ఈ ఎయిర్ పోర్టుల్లో 13 హెలీ ప్యాడ్స్, 2 వాటర్ ఎయిరోడ్రోమ్స్ ఉన్నాయి. ఇకపోతే  2016 నుంచి ఉడే దేశ్కా ఆమ్ నాగరిక్ (UDAN) పథకంలో భాగంగా వీటిని నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా 2024లో కొత్తగా వచ్చే 12 ఎయిర్ పోర్టులను ఛత్తీస్ గఢ్ లోని అంబికాపూర్, మధ్యప్రదేశ్ లోని రేవా, దాతియా, మహారాష్ట్రలోని అమరావతి, సోలాపూర్, డామన్ డయ్యూలోని డామన్, హర్యానాలోని అంబాలా, యూపీలోని మొరదాబాద్, శహరాన్పూర్, తమినళనాడులోని వెల్లూర్, నైవేలీ, అండమాన్ నికోబార్ లోని శివపూర్, కార్ నికోబార్ లతో ప్రారంభించనున్నట్లు విమాన మంత్రి చెప్పారు. మరోవైపు ఇప్పటికే ఉన్న ఎయిర్‌పోర్టులను తీర్చి దిద్దేందుకు తొలి దశలో 4వేల 500 కోట్లు కేటాయించగా, రెండో దశలో రూ.1,000 కోట్ల బడ్జెట్ ను కేటాయించారు. మరీ, త్వరలోనే దేశంలో 12 ఎయిర్ పోర్టులు కొత్తగా అందుబాటులోకి రావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.