iDreamPost

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి అకౌంట్లోకి 25 లక్షలు

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. ఇక నుంచి వారు 25 లక్షలు అందుకోనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో లక్షలాది మంది కేంద్ర ఉద్యోగులకు ప్రయోజనాలు అందనున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. ఇక నుంచి వారు 25 లక్షలు అందుకోనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో లక్షలాది మంది కేంద్ర ఉద్యోగులకు ప్రయోజనాలు అందనున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి అకౌంట్లోకి 25 లక్షలు

ఒక వ్యక్తి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లేది ప్రభుత్వ ఉద్యోగం. చిన్న జాబ్ అయినా సరే గవర్నమెంట్ ఉద్యోగం కావాలని యూత్ ఏళ్లకేళ్లుగా ప్రిపేర్ అవుతుంటారు. ప్రభుత్వ ఉద్యోగమైతే మంచి జీతంతో పాటు ప్రభుత్వం అందించే సదుపాయాలను కూడా పొందొచ్చు. డీఏ, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలను అందుకోవచ్చు. మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం తీపి కబురునుఅందించింది. ఇక నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 25 లక్షలు అందుకోనున్నారు. ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు రిటైర్‌మెంట్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీ లిమిట్‌ను కేంద్రం 25% పెంచింది.

ఉద్యోగులకు కేంద్రం మరో కానుకను అందించింది. రిటైర్‌మెంట్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీ లిమిట్‌ను కేంద్రం 25శాతం పెంచింది. ఇప్పుడు ఉద్యోగులకు గరిష్టంగా రూ.25 లక్షలు గ్రాట్యుటీగా లభిస్తుంది. గతంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ లిమిట్ గరిష్టంగా రూ.20 లక్షలుగా ఉండేది. కాగా డియర్‌నెస్ అలవెన్స్ 50శాతం పెరిగాక ఈ లిమిట్ కూడా పెంచారు. కొత్త గ్రాట్యుటీ పరిమితి జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుంది. కేంద్రం నిర్ణయంతో ఇక నుంచి చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు లేదా పదవీ విరమణ చేసే ఉద్యోగులు గరిష్ఠంగా రూ.25 లక్షల గ్రాట్యుటీ అందుకుంటారు.

గ్రాట్యుటీ అనేది ఉద్యోగి జీతం, పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్‌)కి అదనంగా ఇవ్వబడుతుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ చర్యలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అయితే కంపెనీలో కనీసం ఐదేళ్లు పనిచేసినప్పుడే ఉద్యోగి గ్రాట్యుటీకి అర్హత ఉంటుంది. ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం డీఏను 4శాతం పెంచింది. ఈ నిర్ణయంతో దాదాపు 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతున్నారు. డీఏ పెరగడంతో ఉద్యోగులకు పలు రకాల అలవెన్సులు కూడా పెరిగాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి