iDreamPost
android-app
ios-app

ఈ మందులు వాడుతున్నారా? 156 మందులను నిషేధించిన ప్రభుత్వం.. కారణం ఏంటంటే?

పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న ఫార్మా కంపెనీలతో పాటు కల్తీ మందుల బెడద కూడా ఎక్కువై పోయింది. తాజాగా భారత ప్రభుత్వం 156 మందులపై నిషేధం విధించింది.

పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న ఫార్మా కంపెనీలతో పాటు కల్తీ మందుల బెడద కూడా ఎక్కువై పోయింది. తాజాగా భారత ప్రభుత్వం 156 మందులపై నిషేధం విధించింది.

ఈ మందులు వాడుతున్నారా? 156 మందులను నిషేధించిన ప్రభుత్వం.. కారణం ఏంటంటే?

పూర్వ కాలంలో జబ్బు చేస్తే వనమూలికలతో వైద్యం చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అంతా ఇప్పుడు ఇంగ్లీష్ మందులు వాడేవారే. జలుబు, జ్వరం.. ఇలా ఏ రోగాలకైనా ఫార్మ కంపెనీలు తయారు చేస్తున్న మందులనే యూజ్ చేస్తున్నారు. మందుల వాడకం పెరగడంతో ఫార్మా కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కల్తీ మందులు బెడద ఎక్కువై పోయింది. అయితే కొన్ని రకాల మందులు ఆరోగ్యంపై విష ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి మందులను ప్రభుత్వాలు నిషేధిస్తున్నాయి. తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మా కంపెనీలకు షాకిచ్చింది. ఏకంగా 156 ఎఫ్‌డిసిలను (ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్) నిషేధించింది.

అనేక ఔషధాల (ఎఫ్‌డీసీ) కలయికతో తయారైన మందులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. నిషేధించిన మందుల ప్రొడక్షన్ ను నిలిపి వేయాలని, స్టాక్ ను విక్రయించొద్దని ఫార్మా కంపెనీలను ఆదేశించింది ప్రభుత్వం. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వం నిషేధించిన వాటిలో యాంటీబయాటిక్స్, నొప్పి నివారణలు, మల్టీవిటమిన్లు ఉన్నాయి. యాంటీబయాటిక్స్, అలెర్జీ మందులు, నొప్పి నివారణలు, మల్టీవిటమిన్లు, జ్వరం, అధిక రక్తపోటు కోసం ఇచ్చే మందులు ఉన్నాయి. ఈ మందులు ఆరోగ్యానికి ప్రమాదకరం అని తేలడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు (డిటిఎబి), కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940లోని సెక్షన్ 26A ప్రకారం ఈ నిషేధం విధించబడింది. ఈ మందుల వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిషేధించబడిన ఎఫ్ డీసీలలో యాంటీబయాటిక్స్, యాంటీ-అలెర్జిక్స్, పెయిన్ కిల్లర్స్, మల్టీవిటమిన్లు, జ్వరం, హైపర్ టెన్షన్ కోసం కాంబినేషన్ డోస్‌లు ఉన్నాయి. మెఫెనామిక్ యాసిడ్, పారాసెటమాల్ ఇంజెక్షన్ కలయిక ఉంటుంది. ఇది నొప్పి, వాపు తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఇతర ఎఫ్ డీసీలలో ఉర్సోడెక్సికోలిక్ యాసిడ్, మెట్‌ఫార్మిన్ హెచ్‌సిఎల్ కలయిక మధుమేహం ఉన్నవారిలో కొవ్వు కాలేయానికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు, చర్మ వ్యాధులను నివారించడానికి ఉపయోగించే పోవిడోన్ అయోడిన్, మెట్రోనిడాజోల్ లపై నిషేధం విధించారు.