Pension News: 78 లక్షల మంది పెన్షనర్లకు ప్రధాని మోదీ గుడ్ న్యూస్!

78 లక్షల మంది పెన్షనర్లకు ప్రధాని మోదీ గుడ్ న్యూస్!

Pension News: మూడో సారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఉద్యోగాల కల్పన, యువతకు నైపుణ్యం, వ్యవసాయం, మధ్యతరగతి ప్రజలతో పాటు పెన్షనర్లు సంబంధించిన అంశాలపై దృష్టిని సారించింది. ఈ క్రమంలోనే పెన్షన్ దారులకు సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది.

Pension News: మూడో సారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఉద్యోగాల కల్పన, యువతకు నైపుణ్యం, వ్యవసాయం, మధ్యతరగతి ప్రజలతో పాటు పెన్షనర్లు సంబంధించిన అంశాలపై దృష్టిని సారించింది. ఈ క్రమంలోనే పెన్షన్ దారులకు సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది.

ఇటీవలే దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ క్రమంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి అయితే బీజేపీ వచ్చింది కానీ.. ఊహించని షాక్ తగిలింది. గతం కంటే..గణనీయంగా సీట్లు తగ్గాయి. ఇలా అతికష్టం మీద అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రజలను ఆకట్టుకునే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తోంది. అధికారంలోకి రాగానే అత్యధిక ప్రాధాన్యత ఉద్యోగాల కల్పన, యువతకు నైపుణ్యం, వ్యవసాయం, మధ్యతరగతి ప్రజలతో పాటు పెన్షనర్లు సంబంధించిన అంశాలపై దృష్టిని సారించింది. ఈ క్రమంలోనే త్వరలో పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుంది.

కేంద్ర ప్రభుత్వంలో విధులు నిర్వహించి..పదవి విరమణ చేసిన ఉద్యోగులు  అనేక మంది ఉన్నారు. అలానే ఇతర పెన్షనర్ దారులు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే నెలవారీ కనీస పెన్షన్ ను పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. వారు చేస్తున్న అధిక పెన్షన్ డిమాండ్ ను పరిగణనలోకి తీసుకుంటామని మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని పెన్షనర్ల సంస్థ ఈపీఎస్-95 నేషనల్ మూవ్‌మెంట్ కమిటీ శుక్రవారం తెలిపింది. ఈ పెన్షన్ ల పెంపు విషయంపై ప్రధాని మోదీ దృష్టి సారించారని సమాచారం.

కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవ్య ను తమ ప్రతినిధులను కలిశారని పెన్షనర్ల సంఘం వెల్లడించింది. ఇదే సమయంలో తమ డిమాండ్ల సాధనకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని కార్మిక శాఖ మంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొంది. ఈపీఎస్-95 పథకంలో ఉన్న 78 లక్షల మంది పెన్షనర్లు కనీస నెలవారీ పెన్షన్‌ను రూ.7,500కి పెంచాలనే డిమాండ్ ఉంది. పెన్షన్ దారుల సంఘం ప్రతినిధులు తమ ప్రపోజల్ ను కేంద్రం ప్రభుత్వం ముందు ఉంచారు. దిల్లీలో ఈపీఎస్-95 ఎన్ఏసీ సభ్యులు నిరసను నిర్వహించారు.  దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సభ్యులు ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఈ నిరసన అనంతరం మన్సుఖ్ మాండవియాతో సమావేశం జరిగింది. అనంతరం ఎన్ఏసీ కమిటీ సభ్యులు కీలక విషయాలను ప్రకటించారు.

తమ సమస్యలకు పరిష్కారించేందుకు  ప్రభుత్వం సుముఖంగా ఉందని కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా తమకు హామీ ఇచ్చినట్లు కమిటీ చైర్మన్ అశోక్ రౌత్ వెల్లడించారు.  పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రధాని మోదీ కూడా కట్టుబడి ఉన్నారని తెలిపారు. సాధారణ పెన్షన్ ఫండ్‌కు దీర్ఘకాలిక విరాళాలు ఇస్తున్నప్పటికీ పెన్షదారులకు ఇచ్చే పెన్షన్ చాలా తక్కువని అన్నారు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ కారణంగా వృద్ధ దంపతుల జీవనం కూడా కష్టతరంగా మారిందని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. మొత్తంగా కేంద్రం పెన్షదారుల డిమాండ్ నిరవేర్చేదిశగా అడుగులు వేస్తే.. 78 లక్షల మందికి పెన్షనలు పెరుగుతాయి. మరి.. ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Show comments