Arjun Suravaram
Kolkata Doctor Case, CBI: కోల్ కతా ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసింది. తాజాగా ఈఘటనలో విస్తుతపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
Kolkata Doctor Case, CBI: కోల్ కతా ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసింది. తాజాగా ఈఘటనలో విస్తుతపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
Arjun Suravaram
కోల్ కతా ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసింది. ఈ ఘటనపై దేశమంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అంతేకాక నిందితులను కఠినంగా శిక్షించాలంటూ, మృతురాలికి సంఘీభావం దేశ వ్యాప్తంగా నిరసలను చేపట్టారు. ఇది ఇలా ఉంటే.. ఈ కేసును ఇప్పటికే సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ ను అందుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అలానే తాజాగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ఆదివారం ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ కి సైకోనాలసిస్ టెస్ట్ చేయించింది. దీని ద్వారా అతని మెంటల్ కండీషన్ ఎలా ఉందో పోలీసులు పరిశీలించారు. ఈ పరీక్షలు నిర్వహించే ముందు సంజయ్ రాయ్ వాంగ్మూలం తీసుకున్నారు. అలా నిందితుడు వాంగ్మూలం, ట్రైనీ డాక్టర్ పోస్టు మార్టం నివేదిక ఆధారంగా సీబీఐ అధికారులు అతడికి ఆధిరావారం సైకోనాలసిస్ చేశారు. ఈ టెస్ట్ లో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. అంతేకాక సీబీఐ అధికారులో ఆశ్యర్యపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అతడు వికృతమైన సె0క్స్ అలవాట్లకు బానిస అయ్యాడని, జంతువులా ప్రవర్తించేవాడని అధికారులు గుర్తించారు. విచారణలో అతడు ఏమాత్రం భావోద్వేగానికి గురికాలేదని, ఎలాంటి తొందరపాటు లేకుండా జవాబు చెప్పాడని తెలిపారు. మొత్తంగా అతడి ఆలోచన విధానం అనేది పశువు కంటే దారుణంగా ఉందనే విషయాన్ని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడియల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెమినార్ హాల్లో హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ కేసులో ఎన్నో దారుణాలు వెలుగు చూశాయి. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో దుమ్మురేపాయి. యావత్ దేశం ఈ ఘటనపై స్పందిస్తూ ఆమె న్యాయం జరగాలని కోరుతున్నారు. బాధితురాలుకి న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు చేస్తున్నారు. వైద్యసేవలు నిలిపి.. కొవ్వత్తులతో రోడ్లపై ర్యాలీలు చేస్తున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధానికి వారి డిమాండ్లతో ఓ లేఖ రాసింది. అలానే ఈ కేసును సుప్రీం కోర్టు కూడ సుమోటోగా తీసుకుని విచారణ జరపుతున్న సంగతి తెలిసిందే. మొత్తంగా ఈ ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో వెలుగులోకి వస్తున్న విషయాలను చూస్తేతే మరో నిర్భయ ఘటనను గుర్తు చేస్తుంది. మహిళలకు, మహిళా వైద్యులకు రక్షణ కల్పించేలా చట్టాలు తీసుకురావాలని పెద్ద సంఖ్యలో డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. మరి.. తాజాగా సీబీఐ విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.