పోలీసును ఢీ కొట్టి.. 400 మీటర్లు ఈడ్చుకెళ్లాడు!

ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇటీవల దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎన్నో నిండు ప్రాణాలు బలి అవుతున్నాయి. అతి వేగం, అనుభవ రాహిత్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎన్నిసార్లు హెచ్చరించినా.. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేసినా.. ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. గత నెల దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాల నుంచి డబ్బు, మద్యం, ఇతర వస్తువులు అక్రమంగా రవాణా చేస్తూ ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలకు పోలీసులు చెక్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తున్నారు. ఇలా తనిఖీలు చేస్తున్న సందర్భంగా కారు డ్రైవర్ పోలీస్ ని ఢీ కొట్టి కారు బానెట్ పై ఈడ్చుకువెళ్లాడు. వివరాల్లోకి వెళితే..

గుజరాత్‌లోని సూరత్‌లో దారుణ సంఘటన చెటు చేసుకుంది. సూరత్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారిని డ్రైవర్ ఢీ కొట్టడమే కాదు.. కారు బానెట్ పై దాదాపు 400 మీటర్ల దూరం వరకు ఈడ్చుకు వెళ్లాడు.. దీనికి సంబంధించిన దృశ్యం సీసీ టీవీలో రికార్డు అయ్యింది. ఈ ఘటన కతర్గాం ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి సూరత్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఝాలా మాట్లాడుతూ.. కతర్గాం కు చెందిన అల్కాపురి ఓవర్ బ్రిడ్జి కింద వాహన తనిఖీలు చేపట్టాం. ఈ క్రమంలో నంబర్ ప్లేట్ లేకుండా వైట్ స్కోడా కారు వచ్చింది.. వెంటనే ఆ కారును ఆపే ప్రయత్నం చేశాం. కానీ ఆ డ్రైవర్ అతి వేగంగా కారును నడుపుతూ పోలీసును ఢీ కొట్టాడు. దీంతో సదరు పోలీస్ బ్యానెట్ పై పడిపోయాడు. ఆ డ్రైవర్ కారును ఆపకుండా 400 మీటర్ల దూరం వరకు ఈడ్చుకువెళ్లాడు.

తనిఖీల్లో పాల్గొన్న ఇతర పోలీసులు వెంటనే ఆ కారును వెంబడించారు. వేగంగా వెళ్తున్న కారు స్పీడ్ బ్రేకర్ రావడంతో బ్యానెట్ పై ఉన్న పోలీసు అధికారి కిందపడిపోయారు. ఆయన తలకు తీవ్ర గాయం అయ్యింది. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాం. ఈ ఘటనకు కారకుడైన డ్రైవర్ ని గౌతమ్ జోషీగా గుర్తించాం. కారును స్వాధీనం చేసుకొని అతడిపై హత్యా యత్నం సహ పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేసినట్లు ఏసీపీ ఝాలా తెలిపారు. కారును నిర్లక్ష్యంగా నడిపించడమే కాకుండా.. విధిలో ఉన్న పోలీసు ని దారుణంగా ఈడ్చుకు వెల్లడానికి సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలు చోట్ల ముమ్మర తనిఖీలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కోట్ల నగదు, బంగారం, వెండి, మద్యంతో పాటు ఇతర వస్తువులు పట్టుబడుతున్నాయి.

Show comments