iDreamPost
android-app
ios-app

వీడియో : కారుపై పడ్డ బండరాయి.. దెబ్బకు ముక్కలైపోయింది!

  • Published Jul 05, 2023 | 4:17 PM Updated Updated Jul 05, 2023 | 4:17 PM
  • Published Jul 05, 2023 | 4:17 PMUpdated Jul 05, 2023 | 4:17 PM
వీడియో : కారుపై పడ్డ బండరాయి.. దెబ్బకు ముక్కలైపోయింది!

వర్షా కాలంలో.. కొండప్రాంతాల్లో.. కొండ చరియలు విరిగిపడ్డం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కొండచరియలు విరిగిపడ్డం కారణంగా కొండ ప్రాంతాల్లో ఉన్న రోడ్డపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద మట్టి ముద్దలు.. బండరాళ్లు వాహనాలపై పడ్డం కారణంగా ‍ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. తాజాగా, నాగాలాండ్‌లో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. కొండచరియలు ఓ కారుపై పడ్డం కారణంగా కారు నిమ్మకాయలా బద్దలైంది.

దీంతో కారులోని ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నిన్న సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  మంగళవారం నాగాలాండ్‌లోని ధీమాపూర్‌లో భారీ వర్షం పడుతూ ఉంది. ఆ సమయంలో నేషనల్‌ హైవే 29పై భారీగా ట్రాఫిక్‌ అయింది. ఈ సమయంలో రోడ్డు పక్కనే ఉన్న ఓ పెద్ద బండరాయి దొర్లుకుంటూ వచ్చి ఆగి ఉన్న నల్ల కారుపై పడింది. దీంతో కారు వెనుక భాగం మొత్తం ముక్కలై పోయింది. ఇక, ఆ కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి.

ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా.. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మిగిలిన ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వీరికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఈ విషాదకర సంఘటనపై ముఖ్యమంత్రి సైతం స్పందించారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, ఈ సంఘటన జరిగిన ప్రాంతం కొండచరియలు విరిగిపడ్డ ఘటనలకు చాలా ఫేమస్‌ అని తెలుస్తోంది. తరచుగా ఇక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయట. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ వైరల్‌ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom