Ayodhya: భక్తులకు అలర్ట్‌.. అయోధ్యకు బస్సులు బంద్‌.. ఎప్పటి వరకంటే

అయోధ్య బాలరాముడిని దర్శించుకునేందుకు వెళ్దామనే భక్తులకు అలర్ట్‌. అయోధ్యకు బస్సులను బంద్‌ చేశారు. ఆ వివరాలు..

అయోధ్య బాలరాముడిని దర్శించుకునేందుకు వెళ్దామనే భక్తులకు అలర్ట్‌. అయోధ్యకు బస్సులను బంద్‌ చేశారు. ఆ వివరాలు..

ఎన్నో వందల ఏళ్ల నిరీక్షణ తర్వాత.. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కల సాకారమయ్యింది. జనవరి 22న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆలయంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ అపురూప వేడుక వేళ.. దేశంలో పండగ వాతావరణం నెలకొంది. దీనిలో పాల్గొనడం కోసం దేశవిదేశాల నుంచి భారీగా భక్తులు తరలి వచ్చారు. జైశ్రీరామ్‌ నినాదాల హోరెత్తగా.. పండితుల మంత్రోచ్ఛరణల మధ్య.. బాలరాముడు తన జన్మభూమిలో నిర్మించిన ఆలయంలో కొలువుదీరాడు. ఆ దృశ్యం చూసి భక్తులు పులకించి పోయారు. మొదటి రోజు కేవలం సెలబ్రిటీలకే రామ్‌ లల్లా దర్శనం కల్పించారు. మరుసటి రోజు నుంచే సామాన్య భక్తులకు కూడా దర్శనం కల్పిస్తున్నారు.

బాలరాముడి దర్శనం కోసం మొదటి రోజే 5 లక్షల మంది భక్తులు తరలి వచ్చారు. అంతేకాక తొలి రోజే రామ్‌ లల్లాకు కోట్ల రూపాయల విలువైన విరాళాలు వచ్చాయి. ఇక రెండో రోజు కూడా బాలరాముడి దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. రద్దీ ఇప్పట్లో తగ్గేలా లేదు. దాంతో అక్కడి రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య వచ్చే బస్సులను రద్దు చేసింది.

బాలరాముడి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. లక్నో నుంచి అయోధ్య వచ్చే బస్సులను తాత్కలికంగా రద్దు చేస్తున్నట్లు రవాణా శాఖ ప్రకటించింది. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకన్న వారికి తిరిగి రీఫండ్‌ చేస్తామని చెప్పుకొచ్చింది. బస్సులను ఎప్పుడు ప్రారంభిస్తామో ఇప్పుడే చేప్పలేమంది.

భక్తుల విరాళాలతోనే అయోధ్య రామ మందిరాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. మన దేశం నుంచే కాక విదేశాల నుంచి కూడా మందిర నిర్మాణం కోసం భారీ ఎత్తున విరాళాలు వచ్చాయి. ప్రస్తుతానికి మందిరంలోని మొదటి అంతస్తు మాత్రమే పూర్తయ్యింది. గుడి మొత్తం పూర్తవ్వాలంటే.. మరో రెండేళ్లు పడుతుంది అంటున్నారు. ఇక అయోధ్య బాలరాముడికి దేశ విదేశాల నుంచి భారీ ఎత్తున విరాళాలు వచ్చాయి.

గుజరాత్‌ వ్యాపారి ఒకరు 11 రోట్ల రూపాయల విలువైన కిరీటాన్ని బహుకరించాడు. అలానే అంబానీ దంపతులు కూడా అయోధ్య మందిరానికి భారీ విరాళం ఇచ్చారు. ఇక మందిర ప్రారంభోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు ప్రత్యేక  రైళ్లు ఏర్పాటు చేశారు. మరో 5,6 నెలలు అయోధ్యు భారీగా రద్దీ ఉంటుందని భావిస్తున్నారు. మరో రెండేళ్లల్లో అయోధ్య రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయి అంటున్నారు అక్కడి జనాలు.

Show comments