బస్సులో చెలరేగిన మంటలు.. వైరల్ గా మారిన వీడియో!

Bus on Fire: ఇటీవల ప్రమాదాలు ఎలా ఎప్పుడు ముంచుకు వస్తున్నాయో తెలియని అయోమయ స్థితి. మనం ప్రయాణించే బస్సులు, రైళ్లు, విమానాల్లో సాంకేతిక లోపాల వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Bus on Fire: ఇటీవల ప్రమాదాలు ఎలా ఎప్పుడు ముంచుకు వస్తున్నాయో తెలియని అయోమయ స్థితి. మనం ప్రయాణించే బస్సులు, రైళ్లు, విమానాల్లో సాంకేతిక లోపాల వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

బెంగుళూరులో ఓ బస్సులో హఠాత్తుగా  మంటలు చెలరేగాయి. మంగళవారం నగరంలోని అనిల్ కుంబ్లే సర్కిల్ వద్ద బస్సులో ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో వెంటనే ప్రమత్తమైన స్థానికులు పోలీసులు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది. ఫైర్ ఇంజన్ తో మంటలు ఆర్పారు. ఈ సంఘటన ఉదయం 8 గంటల ప్రాంతంలో జరగగా మంటలు ఆర్పేందుకు చాలా సమయం తీసుకున్నట్లు అధికారు తెలిపారు. బస్సులో మంటలు ఎలా వచ్చాయన్న విషయంపై ఇంకా తెలియరాలేదని అన్నారు. వివరాల్లోకి వెళితే..

బెంగుళూరు నగరం నడిబొడ్డున ఎంజీ రోడ్డులో మంగళవారం ఉదయం బీఎంటీసీ బస్సులో మంటలు చెలరేగాయి. అనిల్ కుంబ్లే సర్కిల్ వద్ద బస్సు (కేఏ 57 ఎఫ్ 1232)లో మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది.  ఈ ఘటన ఉదయం 8.30 నుంచి 9 గంటల మధ్య జరిగినట్లు సమాచారం. బస్సు నుంచి మంటలు, పొగలు రావడంతో చుట్టు పక్కల జనాలు భయబ్రాంతులకు గురయ్యారు.   అగ్నిమాపక, అత్యవసర సేవల కంట్రోల్ కి సమాచారం అందించారు స్థానికులు. సమాచారం అందుకున్న వెంటనే  సౌత్ స్టేషన్ నుండి ఫైర్ ఇంజన్ తో రంగంలోకి దిగి మంటలను కంట్రోల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

బస్సులో మంటలు రావడానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. ఇంజిన్ నుండి పొగలు రావడంతో బస్సు డ్రైవర్ మరియు కండక్టర్ కార్పొరేషన్‌కు సమాచారం అందించారని BMTC వర్గాలు తెలిపాయి. అగ్నిమాపక దళం వచ్చే వరకు డ్రైవర్, కండక్టర్ మంటలను అదుపు చేసేందుకు బస్సులో ఉంచిన ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌ను ఉపయోగించినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.  గతంలో బెంగుళూరులో వీరభద్ర నగర్ లోని ఓ గ్యారేజీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో దాదాపు 40 బస్సులు మంటల్లో దగ్దమైన విషయం తెలిసిందే. ఏసీ బస్సుల్లో తరుచూ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్రి ప్రమాదాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

 

Show comments