Arjun Suravaram
ప్రమాదాలు ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో ఎవ్వరం చెప్పలేము. ఎంతో మంది జీవనోపాధి కోసం కూలీ పనులకు వెళ్తుంటారు. అలా వెళ్లిన వారి కొందరు ప్రమాదాలకు గురై మరణిస్తుంటారు. తాజాగా ఓ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ భవనం కింద 25 మంది..
ప్రమాదాలు ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో ఎవ్వరం చెప్పలేము. ఎంతో మంది జీవనోపాధి కోసం కూలీ పనులకు వెళ్తుంటారు. అలా వెళ్లిన వారి కొందరు ప్రమాదాలకు గురై మరణిస్తుంటారు. తాజాగా ఓ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ భవనం కింద 25 మంది..
Arjun Suravaram
ఎంతో మంది జీవనోపాధి కోసం దేశందాటి వెళ్తుంటారు. మరికొందరు ఇతర రాష్ట్రాలకు వెళ్లి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాని పోషిస్తుంటారు. అయితే ఇలా జీవనం కోసం భవన నిర్మాణాలు,హోటల్స్, మాల్స్, ఫార్మా కంపెనీలు వంటి వాటిల్లో పని చేస్తుంటారు. అయితే ఇలా పని చేస్తున్న సమయంలో కొన్ని చోట్ల అనుకోకుండా జరిగే ప్రమాదాల్లో ఎంతో మంది కూలీలు దుర్మరణం చెందుతున్నారు. తాజాగా నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 25 మంది శిధిలాల కింద చిక్కుకున్నారు. ఒకరు మృతి చెందగా పలువురు కి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో జనసత్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రాంతంలో రెండు అంతస్తులు భవన నిర్మాణం జరుగుతుంది. రోజూ కూలీ వచ్చి ఆ భవన నిర్మాణ పనుల్లో పాల్గొనే వారు. అలానే ఆదివారం కూడా కొందరు కూలీలు ఈ భవన నిర్మాణ పనులకు వెళ్లారు. ఈ క్రమంలో సాయంత్రం 5.30 గంటల సమయంలో నిర్మాణంలో ఈ రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో పెద్ద పెట్టున ఆహాకారాలు వినిపించాయి. ఇక ప్రమాదంలో శిథిలాల కింద 25 మంది కూలీలు చిక్కుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అధికారులు వెంటనే సంఘటన స్థలంకి చేరుకున్నారు. అలానే శిథిలాల కింద చిక్కుకున్న వారికిని కాపాడేందుకు సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద ఉన్న పలువురు కార్మికులను బయటకు తీసి స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఇక ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఒకరు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని 15 మందిని కాపాడినట్లు ముజఫర్ నగర్ జిల్లా ఎస్పీ తెలిపారు. కూలిన రెండు అంతస్తుల భవన శిథిలాలను తొలగించి అందులోని వారి రక్షించడంతో భారీ ప్రాణ నష్టం జరగలేదని స్థానిక అధికారులు తెలిపారు. ఇటీవలే బీహార్ లో ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న వంతెన ఒకటి కుప్పకూలిపోయి ముగ్గురు చనిపోయారు. అలానే చైనాలోని ఓ ఇండోర్ స్టేడియం కూలిపోయి 12 మంది విద్యార్థులు మరణించారు. ఇలాంటి ఘటనలకు కారణం ఏమైనప్పటికి ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు..ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
मुख्यमंत्री श्री @myogiadityanath जी महाराज ने मुजफ्फरनगर के जानसठ क्षेत्र में भवन गिरने की दुर्घटना में घायल लोगों का समुचित उपचार कराने तथा तत्काल मौके पर पहुंच कर राहत कार्य में तेजी लाने हेतु अधिकारियों को निर्देशित किया है।
महाराज जी ने प्रभु श्री राम से घायलों को शीघ्र…
— Yogi Adityanath Office (@myogioffice) April 14, 2024