Food: ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. ఇక ఆ భయం అక్కర్లేదు! అసలు విషయం ఏమిటంటే?

Food: మీరు బయట క్వాలిటీ లేని ఫుడ్ తింటున్నారా? అయితే ఇలా చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు..

Food: మీరు బయట క్వాలిటీ లేని ఫుడ్ తింటున్నారా? అయితే ఇలా చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు..

ప్రస్తుతం మార్కెట్లో అన్ని ఆహార పదార్ధాలు కూడా కల్తీ అవుతున్నాయి. కాసులకు కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నారు. ఆహారాలను చాలా దారుణంగా కల్తీ చేసి ప్రజలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు చాలా మంది కేటుగాళ్లు. ఉప్పు నుంచి పప్పు దాకా చివరికి స్వచ్ఛతకు మారు పేరైన పాలను కూడా కల్తీ చేస్తున్నారు. చాలా మంది పాలల్లో నీళ్లను కలిపి అమ్ముతున్నారు. ఈ రకమైన కల్తీ ఎప్పటినుంచో జరుగుతుంది. అయితే ఈ రోజుల్లో మాత్రం ఏకంగా రసాయనాలనే మిక్స్ చేస్తున్నారు మోసగాళ్ళు. అలాంటి స్వచ్ఛత లేని పాలను తయారు చేస్తున్నారు. అంతేగాక బయట, పలు హోటల్స్ లో ఫుడ్ ఎలా పడితే అలా శుభ్రత లేకుండా చేస్తున్నారు. ఫుడ్ ఎంత దారుణంగా చేస్తున్నారో రీసెంట్ గా కొన్ని వీడియోలు వైరల్ కూడా అయ్యాయి. ఇలా ఇప్పటి నుంచే కాదు.. ఎప్పటి నుంచో కల్తీ ఫుడ్ చలామణి అవుతుంది. అయితే ఇలా ఆహార పదార్థాలను కల్తీ చేసే వారికి కచ్చితంగా తగిన శిక్ష పడుతుందని సమాచారం తెలుస్తుంది. ఇంతకీ ఎలాంటి శిక్షలు పడతాయి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఫుడ్ క్వాలిటీ విషయంలో దేశంలో ప్రత్యేక చట్టాలే ఉన్నాయి. దేశంలో కల్తీ ఆహార పదార్థాలను నియంత్రించేందుకు Food Safety and Standards Act 2006 రూపొందించారు. దీంతోపాటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) రూల్స్ ని కూడా కచ్చితంగా పాటించాలి. ఈ చట్టం ప్రకారం, ఆహార పదార్థాలను ఎవరైనా కల్తీ చేస్తే వారిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారు. పాల నుంచి ఎలాంటి ఆహార పదార్థాలను కల్తీ చేసినా కూడా అది నేరం కిందికి వస్తుందని చట్టం చెబుతోంది. ఒకవేళ నేరం రుజువయ్యి ఫుడ్ కల్తీ అయిందని తేలితే.. జరిమానా, శిక్ష లేదా రెండూ విధించే కఠినమైన రూల్ కూడా ఉంది. ఇక జరిమానా విషయానికొస్తే.. ఎవరైనా వ్యక్తి ఆహార పదార్థాలను కల్తీ చేస్తే అతనికి ఏకంగా లక్ష రూపాయల దాకా జరిమానా విధించవచ్చు. ఇంకా అంతే కాదు.. నేర తీవ్రత ఆధారంగా జరిమానాతో పాటు 6 నెలల నుంచి 7 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ కల్తీ ఆహార పదార్థాలు తినడం వల్ల ఒక వ్యక్తి మరణిస్తే, కల్తీ చేసిన వ్యక్తికి జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల దాకా కఠిన జైలు శిక్షని విధించవచ్చు.

Food Safety and Standards Act 2006 తో పాటు,Indian Penal Code (IPC) లో కూడా కల్తీకి సంబంధించిన నేరాలకు కఠిన రూల్స్ ఉన్నాయి. IPC లోని సెక్షన్ 272 , 273 ప్రకారం కల్తీ ఆహార పదార్థాలను అమ్మిన వ్యక్తికి 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు కఠిన జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశాలు ఉంటాయి. ఇదీ సంగతి.. ఇక నుంచి ఫుడ్ ని ఏ విధంగా అయినా కల్తీ చేస్తే కచ్చితంగా ఈ శిక్షలు తప్పవు.. ఎక్కడైనా ఫుడ్ బాగోలేదని కల్తీ అయిందని తెలిస్తే కచ్చితంగా 040-21111111 నెంబర్ కి కంప్లయింట్ చేయండి. లేకపోతే FSSAI వెబ్ సైట్ లోకి వెళ్ళి మీ కంప్లైంట్ ని రిజిస్టర్ చేయండి. మరి ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments