Arjun Suravaram
అంతులేనిది తల్లి ప్రేమ. బిడ్డలకు ఏ చిన్న కష్టం రానివ్వకుండా ప్రతిక్షణం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇక బిడ్డలకు ఏ చిన్న ప్రమాదం జరిగిన తల్లి మనస్సు అల్లాడిపోతుంది. అలా తనను పెంచి పెద్ద చేసిన తల్లి కోసం ఓ కుమారుడు సాహసం చేశాడు.
అంతులేనిది తల్లి ప్రేమ. బిడ్డలకు ఏ చిన్న కష్టం రానివ్వకుండా ప్రతిక్షణం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇక బిడ్డలకు ఏ చిన్న ప్రమాదం జరిగిన తల్లి మనస్సు అల్లాడిపోతుంది. అలా తనను పెంచి పెద్ద చేసిన తల్లి కోసం ఓ కుమారుడు సాహసం చేశాడు.
Arjun Suravaram
ఈ భూమిపై విలువ కట్టేలేనిది అంటూ ఉన్నాది అంటే అది అమ్మ ప్రేమ మాత్రమే. తన ప్రాణాలను పణంగా పెట్టి.. మనకు జన్మనిస్తుంది. అంతేకాక తన సుఖ సంతోషాలను వదులుకుని బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. బిడ్డలకు ఏ చిన్న కష్టం రానివ్వకుండా ప్రతిక్షణం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇక బిడ్డలకు ఏ చిన్న ప్రమాదం జరిగిన తల్లి మనస్సు అల్లాడిపోతుంది. అలా గోరు ముద్దలు తినిపిస్తూ..పెంచి పెద్ద చేస్తుంది. అలాంటి తల్లిపై కొందరుబిడ్డలు కర్కాశత్వం ప్రదర్శిస్తుంటారు. మరికొందరు బిడ్డలు అమ్మపై ఆకాశమంత ప్రేమను చూపిస్తుంటారు. అలానే కొడుకు తన తల్లి కోసం కారులో 18వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఆ వ్యక్తి ఎవరు, అసలు అలా ఎందుకు ప్రయాణం చేశాడు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
భారత సంతతికి చెందిన విరాజ్ ముంగాలే బ్రిటన్ లో నివాసం ఉంటున్నాడు. అతడు తన కుటుంబ సభ్యులతో కలిసి లండన్ లో నివాసం ఉంటున్నాడు. ఇక ఆయన తల్లి మాత్రం మహారాష్ట్రలోని తానేలో ఉంటుంది. విరాజ్ ముంగాలే..లండన్ లోని ఓ ప్రైవేటు కంపెనీలు ఉద్యోగం చేస్తున్నాడు. ఇది ఇలా ఉంటే.. ఇండియాలో ఉన్న తల్లిని కలవాని భావించాడు. అంతేకాక తన తల్లిపై ఆయనకు ఉన్న ప్రేమను ప్రత్యేకంగా చాటాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే తన తల్లిని కలిసేందుకు ఏకంగా ఒక సాహసయాత్రే చేశాడు.
అమ్మను కలవడానికి లండన్ నుంచి ఏకంగా ఎస్‌యూవీ కారులో బయలుదేరి సక్సెస్ ఫుల్ థాణే చేరుకున్నాడు. అయితే విరాజ్ జర్నీ అంత ఈజీగా సాగలేదు. అనేక సమస్యలను సవాళ్లను ఎదుర్కొంటూనే తన సాహసయాత్రను పూర్తి చేశాడు. అమ్మను కలిసేందుకు విరాజ్ చేపట్టిన ప్రయాణంలో 59 రోజుల్లో 18,300 కి.మీ ప్రయాణించిడమే కాకుండా 16 దేశాలను సందర్శించాడు. వాటిలో యూకే, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, పోలాండ్, రష్యా, ఉజ్బెకిస్థాన్, చైనా, టిబెట్, నేపాల్ తదితర దేశాలు ఉన్నాయి. అలా ఆ దేశాలని దాటుకుంటూ చివరకు భారత్ లోనే తల్లిని చేరుకున్నాడు.
ఇక ఈ సాహస యాత్ర అనంతరం విరాజ్ మాట్లాడుతూ.. పలు విషయాలను షేర్ చేసుకున్నాడు. గతంలో పలువురు ఇలా చేసిన యాత్రలు తనలో స్ఫూర్తిని నింపాయని ఆయన తెలిపారు. తాను రోజుకు 400-600 కి.మీ డ్రైవ్ చేసేవాడినని తెలిపాడు. అలానే కొన్ని సార్లు వెయ్యి కి.మీ కూడా వెళ్లిన సందర్భాలున్నాయని తెలిపాడు. సాధ్యమైనంత వరకు రాత్రిపూట జర్నీ చేసేవాడిని కాదని తెలిపింది. ఈ యాత్ర కోసం తన ఆఫీస్‌కి రెండు నెలలు సెలవు పెట్టానని, తాను ప్రయాణించే దేశాల్లో పర్మిషన్లు ముందే తీసుకున్నానని తెలిపాడు. మొత్తంగా అలా వేల కిలోమీటర్లు జర్నీ చేసి.. తన వద్దకు వచ్చిన కుమారుడిని చూసి.. విరాజ్ తల్లి సంతోషం వ్యక్తం చేసింది. మరి..తల్లిపై కొడుకు చూపిన ఈ గొప్ప ప్రేమపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.