iDreamPost

భారీగా పెరిగిన టమాటా ధర.. కాపలాకు బౌన్సర్ల!

భారీగా పెరిగిన టమాటా ధర.. కాపలాకు బౌన్సర్ల!

సెలబ్రిటీలు ఎవరైనా  బయటకు వచ్చినప్పుడు, ఏదైనా ప్రైవేటు ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు బౌన్సర్లు ఏర్పాటు చేస్తారు.  అలానే పబ్ లు, బార్ల దగ్గర గొడవలు జరగకుండా ఉండేందుకు కూడా బౌన్సర్లను ఉపయోగించుకుంటాము. ఇలా వివిధ సందర్భాల్లో బౌన్సర్లను ఉపయోగిస్తుంటారు. అయితే ఎవరైనా కూరగాయలకు బౌన్సర్లను ఏర్పాటు చేస్తారా?. ఆ ప్రశ్నకు ఎవరైన నవ్వుతారు.  అయితే అలాంటి ఘటన కూడా జరిగింది. ఉత్తర ప్రదేశ్ లోని వారణాశిలో ఓ కూరగాయల షాపుకి బౌన్సర్లు కాపలాగా  ఉన్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దేశవ్యాప్తంగా కూరగాయలు రేట్లు బాగా పెరిగిపోయాయి. ముఖ్యం టమాటాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఎంతలా అంటే.. టమాటా ధరలు ప్రస్తుతం  హాట్ టాపిక్ గా మారింది. ఎన్నడూ చూడని, ఎప్పుడూ కొనుగోలు చేయని ధరలకు టమాటాలు విక్రయిస్తుంటే సామాన్య జనం అల్లాడి  పోతున్నారు.  కొందరు కామెడీగా టమాటాలను ఎర్ర బంగారం అని పిలుచుకుంటున్నారు. అందుకు తగ్గినట్లే.. బంగారాన్ని చోరీ చేసినట్లు టమాటాలను దొంగిలిస్తున్నారు.  పలు ప్రాంతాల్లోని కూరగాయల షాపుల్లో దొంగలు పడ్డారు. మిగత కూరగాయాలను అక్కడే వదిలేసి కేవలం టమాటా, మిర్చిని ఎత్తుకెళ్లిన ఉదాహరణలున్నాయి.

కర్నాటకలో టమాటా తోటలో దొంగలు పడి 3 లక్షల రూపాయల విలువైన పంటను ఎత్తుకెళ్లిన సంఘటన  సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ లోని వారణసిలో సమాజీవాదీ  పార్టీకి చెందిన  అజయ్ అనే కార్యకర్త వ్యంగ్యంగా చేశాడు. తన  కూరగాయాల దుకాణం ముందు ఔన్సర్లను రక్షణగా ఏర్పాటు చేసుకున్నారు.  అటుగా వెళ్తున్న జనం టమాటాలకు బౌన్సర్లు కాపాలాగా ఉండటం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు వారిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇక అజయ్ మాట్లాడుతూ…. తమ షాపుకి వచ్చే కస్టమర్లు టమాటాల కోసం గొడవ పడుతున్నారని, కొంతమంది తెలివిగా వాటిని సంచిలో వేసుకుని వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎవరు టమాటాలను దొంగిలించేందుకు అవకాశం లేకుండా  ఔన్సర్లును కాపలాగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపాడు.  సమాజ్ వాదీ పార్టీ చీఫ్  అఖిలేశ్ యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా  అజయ్ టమాట ఆకృతిలో ఉన్న కేకును సైతం కట్ చేశాడు. తమ పార్టీ కార్యకర్త దుకాణం ముందు బౌన్సర్ల ఏర్పాటు చిత్రాలను అఖిలేశ్ యాదవ్ సోషల్ మీడియోలో పోస్ట్ చేశారు. “భాజపా ప్రభుత్వం టమాటాలకు జడ్ ఫ్లస్ భద్రత కల్పించాలి” అని సరదా  వ్యాఖ్య జోడించారు.మరి… ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి