P Krishna
ఇటీవల ప్రయాణ ప్రదేశాలు బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్, విమానాశ్రయాలతో పాటు పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నేతల ఇండ్లకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం.. పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టడం చూస్తూనే ఉన్నాం.
ఇటీవల ప్రయాణ ప్రదేశాలు బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్, విమానాశ్రయాలతో పాటు పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నేతల ఇండ్లకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం.. పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టడం చూస్తూనే ఉన్నాం.
P Krishna
ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం చూస్తునే ఉన్నాం. ఇండ్లు, ఆఫీస్ లో బాంబు పెట్టామని.. త్వరాలో అది పేలిపోతుందని బెదిరిస్తూ కాల్స్ చేయడం సర్వసాధారణం అయ్యింది. బెదిరింపు కాల్స్ రాగానే పోలీసులు రంగంలోకి దిగి డాగ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా పరిశీలిస్తారు. కానీ ఎక్కడ కూడా బాంబులకు సంబంధించిన ఆనవాలు లభించకపోవడంతో ఆ బాంబ్ కాల్స్ ఫేక్ అని అంతా ఊపిరి పీల్చుకుంటారు. ఈ మధ్య కర్ణాటకలో కొన్ని పాఠశాలలకు బాంబ్ పెట్టినట్లు మెయిల్ లో బెదిరింపు కాల్స్ వచ్చాయి.. కానీ ఏ ప్రమాదం జరగలేదు. కొంతమంది ఆకతాయిలు కావాలని ఇలాంటి బెదిరింపు కాల్స్ చేస్తుంటారని పోలీసులు అంటుంటారు. తాజాగా దేశ ఐటీ రాజధాని బెంగుళూరులో బాంబ్ బెదిరింపు కాల్స్ హడలెత్తించాయి. వివరాల్లోకి వెళితే..
బెంగుళూరులోని గవర్నర్ బంగ్లా రాజ్ భవన్ కి బాంబు పెట్టామని.. ఆలస్యం చేస్తే పేలిపోతుందని బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. బెదిరింపు కాల్స్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు రాజ్ భవన్ ని అణువణువు క్షుణ్ణంగా జల్లెడ పట్టారు. డిసెంబర్ 11 రాత్రి 11.30 గంటల ప్రాంతంలతో రాజ్ భవన్ లో బాంబు పెట్టినట్లు అపరిచితుడు ఫోన్ చేశాడు. రాజ్ భవన్ సెక్యూరిటీ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రగంగంలోకి దిగిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకొని పూర్తిగా వెతికారు. కానీ ఎక్కడ కూడా బాంబు అనావాళ్లు లభించలేదు.. అయితే వచ్చింది ఫేక్ కాల్ అని నిర్దారించారు పోలీసులు. రాజ్ భవన్ మైదానం మొత్తం తిరుగుతూ అధికారులు కూంబింగ్ నిర్వహించారు.. బాంబు బెదిరింపు కాల్ చేసింది ఎవరు అన్న విషయాన్ని కనిపెట్టే ప్రయత్నం మొదలు పెట్టారు.
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇటీవల భారీ ఎత్తున తనిఖీలు నిర్వహించి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది అధికారులను టార్గెట్ చేసుకొని అజ్ఞాత వ్యక్తి బాంబు బెదిరింపులకు పాల్పపడ్డాడు. ఈ క్రమంలోనే రాజ్ భవన్ లో పెట్టినట్టు ఆ సంస్థ అధికారులకే రావడం గమనార్హం. వెంటనే ఎన్ఐఏ అధికారులు బెంగుళూరు పోలీసులను అప్రమత్తం చేశారు. ఇటీవల దేశంలోకి ఉగ్రమూకలు చొరబడ్డారన్న విషయంపై ఎన్ఐఏ విస్త్రృత తనిఖీలు చేపట్టివంది. మహారాష్ట్రలోని పూణే లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద కుట్రలో 13 మంది ని అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక పోలీసులు సమన్వయంతో ఉగ్ర నిరోదక సంస్థ ఈ ప్రాంతాల్లో దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో కర్ణాటకలోని రాజ్ భవన్ కు బాంబు బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకం రేపింది. ఈ క్రమంలోనే సెంట్రల్ డివిజన్ పోలీసులు విధాన సౌద పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.